Anil – Megastar Chiranjeevi: ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కథలను ఎంచుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది. ఎంతోమంది దర్శకులు ఇవ్వలేని హిట్టును ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి యంగ్ డైరెక్టర్ ఇస్తున్నారు. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయినను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాలో బాబీ మెగాస్టార్ చిరంజీవిని చూపించిన విధానం విపరీతంగా ఆకట్టుకుంది. ఒక సగటు మెగాస్టార్ చిరంజీవి అభిమాని మెగాస్టార్ ను ఎలా చూడాలనుకుంటున్నాడు అలా చూపించి సక్సెస్ అందుకున్నాడు. మెగాస్టార్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను మరోసారి బయటకు తీశాడు.
యంగ్ దర్శకులతో…
మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. బింబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన వశిష్ట తో ఇదివరకే విశ్వంభరా అనే సినిమాను పట్టాలెక్కించారు. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఈ సినిమా మీది కూడా అందరికీ విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత సోషియో ఫాంటసీ జోనర్ లో వస్తున్న సినిమా కావడంతో అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే
ఈ నెలాఖరు నుండి షూటింగ్ మొదలు పెట్టే ప్లానింగ్ జరుగుతుందట. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ రెండో షెడ్యూల్ కేరళలో అనుకుంటున్నారు. రిలీజ్ కి ముందు కాదు…సెకండ్ షెడ్యూల్ నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఒక మంచి సినిమాను చేయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను ప్రేక్షకులలోనికి తీసుకువెళ్లడం కూడా అంతే ముఖ్యం. అయితే రీసెంట్ గా అనిల్ రావిపూడి తాను చేసిన ప్రతి సినిమాను ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలామందికి చేరి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది అంటే కారణం అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్. ఇక చిరంజీవితో చేయబోయే సినిమా సంక్రాంతి కానుక విడుదల చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కి కూడా మంచి రీచ్ వచ్చింది.
Also Read : RGV: నేను దావుద్ తో మాట్లాడాను, కానీ అది దావుద్ అని గ్యారెంటీ గా చెప్పలేను