BigTV English

Sobhita Akkineni: చైతన్య గురించి నాగ్ అలా చెప్పేసరికి.. కన్నీళ్లు పెట్టుకున్న శోభితా

Sobhita Akkineni: చైతన్య గురించి నాగ్ అలా చెప్పేసరికి.. కన్నీళ్లు పెట్టుకున్న శోభితా

Sobhita Akkineni: ఏ భార్య అయినా కోరుకునేది భర్త విజయమే. ఆ భర్త సక్సెస్ అయ్యాడు అంటే మొదట సంతోషించేది భార్యనే. ఇక ఆ సక్సెస్ వెనుక కష్టం గురించి విన్నప్పుడు భార్యకు కంటనీరు రావడం సాధారణమే. అయితే ఆ ఎమోషన్ కు సెలబ్రిటీలు సైతం అతీతం ఏమి కాదు. తాజాగా శోభితా అక్కినేని సైతం భర్త చైతన్య పడిన కష్టం విని కంటతడి పెట్టుకుంది. అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న  రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.73.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది.


ఇక  తండేల్  భారీ విజయాన్ని అందుకోవడంతో మేకర్స్ తండేల్ లవ్ సునామీ వేడుకలు పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. పెళ్లి తరువాత శోభితా.. చైతో  కలిసి మొదటి సక్సెస్ మీట్ లో పాల్గొంది.  ఈ వేడుకలో భాగంగా నాగ్.. కొడుకు సక్సెస్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం చై 2 ఏళ్లు కష్టపడినట్లు తెలిపాడు.

” చైతన్య షూటింగ్ కు వెళ్తూ వస్తూ ఉండేవాడు. 2 ఏళ్లు కమిట్ అయ్యాడు. ఫుల్ గడ్డం, జుట్టు.  ఫేస్ మారుతూ వస్తుంది. ఎరా కష్టంగా ఉందా అంటే లేదు నాన్న బాగానే ఉంది. ఒకరోజు షూటింగ్ ఎక్కడ అంటే.. సముద్రంలో అన్నాడు. ఎలా ఉంది అంటే చాలా కష్టంగా ఉంది అన్నాడు. ఆ జాలరులు పడే బాధ నాకు కూడా తెలుస్తుంది అని చెప్పాడు” అని చెప్పుకొచ్చాడు. 


Akkineni Nagarjuna: కొడుకు- కోడలు ముందు అలాంటి వీడియోలు చూపించకండి.. నాగార్జున కామెంట్స్ వైరల్

ఇక మామ నాగ్.. భర్త చై గురించి, అతను సినిమా కోసం పడిన కష్టం గురించి చెప్తుంటే.. కింద కూర్చున్న శోభితా ఎమోషనల్ అయ్యింది.భర్త కష్టం గురించి వింటూ కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భర్త సక్సెస్ ను చూసి భార్య ఆనందం ఇలా చూపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.   ఇక  శోభితాతో పరిచయం అయ్యిన తరువాత చై పలు సినిమాలు చేసినా.. ఆమెతో పెళ్లి అన్నప్పటి నుంచి చై.. తండేల్ మూవీ కోసమే లుక్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.

ఎన్నోసార్లు శోభితా ఆ గడ్డం చూసి ఎప్పుడు  క్లీన్ షేవ్ చేస్తావ్  అని అడుగుతూ ఉండేదట. పెళ్లి పీటల మీదనే మా ఆయనను గడ్డం లేకుండా నాకెప్పుడూ చూపిస్తారు  అని అల్లు అరవింద్ ను అడిగిందట శోభితా. తండేల్ రిలీజ్ అయిన రోజున చై.. నీకు నచ్చినట్లు కనిపిస్తాడు అని అల్లు అరవింద్ చెప్పాడట. ఇక ఎట్టకేలకు సినిమా  రిలీజ్ అయ్యింది. మంచి విజయాన్ని కూడా అందుకుంది. అయినా చై ఇంకా గడ్డం తీయలేదు. ఈ సక్సెస్  మీట్ తో పాటు.. మరికొన్ని సెలబ్రేషన్స్  ఉన్నాయట. అవన్నీ అయ్యాకా చై గడ్డం తీస్తాడని టాక్ నడుస్తోంది. మరి శోభితా కోరికను చై ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×