North Korea Tourists: ఉత్తర కొరియా అధ్యక్షడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆ దేశాన్ని సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు సాదరస్వాగతం పలికారు. కరోనా తర్వాత ఇతర దేశాల వారిని దేశంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ విదేశీ పర్యాటకులు ఉత్తర కొరియాలో పర్యటించే అవకాశాన్నికల్పిస్తున్నారు. ఇప్పటికే నార్త్ కొరియాకు చెందిన పలు టూరిజం సంస్థలు విదేశీ పర్యాటకులకు సంబంధించి టూర్ ప్లాన్స్ అనౌన్స్ చేస్తున్నాయి. నియంత పాలనలోని ఉత్తర కొరియాను చూసేందుకు చాలా మంది విదేశీ పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చైనాలోని బీజింగ్‌కు చెందిన కొరియో టూర్స్ ఆరు రోజుల పర్యటన కోసం ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలుపెట్టింది.
పర్యాటకుల కదలికలపై ప్రభుత్వ పర్యవేక్షణ
ఉత్తర కొరియా దివంగత నాయకుడు కిమ్ జోంగ్ II పుట్టిన రోజు వేడుకలను ఈ నెల (ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు) దేశ వ్యాప్తంగా జరుపుతున్నారు. ‘డే ఆఫ్ ది షైనింగ్ స్టార్’ పేరుతో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగానే విదేశీ పర్యాటకులను దేశంలోకి ఆహ్వానిస్తున్నారు కిమ్. పర్యాటకులు స్టేట్-గైడెడ్ పర్యాటకం, ఉత్తర కొరియాలోని ప్రత్యేక పర్యాటక ప్రాంతానలు చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఉత్తర కొరియాలో పర్యాటకులకు పలు కండీషన్లు ఉంటాయి. అనుమతించిన ప్రాంతాల్లోనే పర్యటించాల్సి ఉంటుంది. పర్యాటకుల కదలికలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా నార్త్ కొరియాకు వెళ్లాలని ఉంటే ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి.
ఉత్తర కొరియాలో చూడాల్సిన పర్యటక ప్రాంతాలు
⦿ కుంసుసన్ మెమోరియల్ ప్యాలెస్
కుంసుసన్ మెమోరియల్ ప్యాలెస్ అనేది దేశానికి చెందిన గొప్ప నాయకులు విశ్రాంతి తీసుకున్న స్థలాలు. ఇది ప్రపంచంలోని గొప్ప పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే, ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. లేకుండా ఈ ప్రదేశంలోకి మీకు ఎంట్రీ ఉండదు.
⦿ మౌంట్ మైయోహ్యాంగ్
ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో ఆహా అనిపిస్తుంది. ఇక్కడి రెండు ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి. కొరియా యుద్ధంలో నాశనం అయిన తర్వాత పునర్నిర్మించబడిన పోహ్యోన్ ఆలయంతో పాటు ఆ దేశానికి చెందిన నాయకులకు సంబంధించిన బహుమతులు కొలువుదీరిన ప్రదర్శనశాల తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు.
⦿ కోంగ్మిన్ సమాధి
హ్యోన్ జోంగ్ రంగ్ సమాధిని రాయల్ సమాధి అని కూడా పిలుస్తారు. ఇది 14వ శతాబ్దపు సమాధి. ఇది దేశంలోని అత్యంత సుందరమైన చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఒక కొండపై కూర్చుని ఒక అందమైన లోయలను చూడవచ్చు. ఉత్తర కొరియాలోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అంతా ఇక్కడే ఉందా? అనిపిస్తుంది. అటు నియంత పాలనలో ఉన్న నార్త్ కొరియాలో ఏ చిన్న పొరపాటు చేసినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. అంత రిస్క్ అవసరమా? అని మరికొంత మంది టూరిస్టులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: 7 సార్లు చావును చూసి వచ్చాడు, ఆ వెంటనే కోటీశ్వరుడు అయ్యాడు.. ఇంత లక్కీ పర్సన్ ఈ లోకంలోనే లేడు!