BigTV English

Akkineni Nagarjuna: కొడుకు- కోడలు ముందు అలాంటి వీడియోలు చూపించకండి.. నాగార్జున కామెంట్స్ వైరల్

Akkineni Nagarjuna: కొడుకు- కోడలు ముందు అలాంటి వీడియోలు చూపించకండి.. నాగార్జున కామెంట్స్ వైరల్

Akkineni Nagarjuna:  అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా  ఫిబ్రవరి 7 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చై కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నాలుగు రోజుల్లో తండేల్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.73.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది.ఇక తండేల్  భారీ విజయాన్ని అందుకోవడంతో మేకర్స్ తండేల్ లవ్ సునామీ వేడుకలు పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. 


ఇక వేడుకలో నాగార్జున అభిమానులను తన ఛలోక్తులతో అలరించాడు. నాగ్ ను పిలిచే ముందు ఆయనకు సంబంధించిన AVచూపించగా.. అందులో ఆయన రొమాంటిక్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇక స్టేజి మీదకు రాగానే యాంకర్ తో కొడుకు- కోడలు ముందు అలాంటి వీడియోలు చూపించకండి.. దయచేసి అని  నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా గురించి నాగ్ మాట్లాడుతూ.. ” అరవింద్ గారు  కథ విన్న వేళావిశేషం.. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన వేళా విశేషం.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాలనుకున్న వేళా విశేషం. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న వేళా విశేషం. ఇవన్నీ బావున్నాయి. ఇవాళా తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.

7 వ తారీఖు సినిమా రిలీజ్ అయ్యింది. ప్రధాని మోదీ గారిని కలవడానికి వెళ్ళాము. ఫోన్ లు అన్ని తీసేసుకున్నారు. నా దగ్గర ఫోన్ లేదు. చై ఫోన్ ఆన్ చేస్తాడు. వాడు ముఖంలో ఆనందం చూద్దామని చూస్తూ ఉన్నాను. వాడేమో త్వరగా వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాక ఫోన్ ఆన్ చేశాను. కంగ్రాట్యులేషన్ అప్పా .. అంటూ ఫోన్ కాల్ వచ్చింది. ఆ తరువాత వరుసగా ఫ్యాన్స్ దగ్గరనుంచి మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. అప్పుడు అర్ధమయ్యింది. నాకన్నా, చైతన్య కన్నా.. అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు  ఎంత ఆనందపడుతున్నారో అని.. అందుకే అన్నాను. చాలా రోజులు అయ్యిందయ్యా.. సక్సెస్ మీట్ కి వచ్చి అని.


ముందుగా అరవింద్ గారికి థాంక్యూ. ఆరోజన పిలిపించి కథ వినండి అని చెప్పారు. ఈ కథ విన్నాక బావుంది అనుకున్నాం. దాన్ని తీసుకెళ్లి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి.. అసలు మీ వయస్సెంత  అండీ.. లవ్  స్టోరీ ఎలా తీశారండీ. ఆ స్టోరీకి పర్ఫెక్ట్  గా కనిపించే స్టార్స్ ను తీసుకొని.. టెక్నీషియన్స్ ను సెట్ చేసి, సినిమాను తెరకెక్కించి.. అంత ఈజీ కాదండీ సినిమా తీయడం.  థాంక్యూ. గజినీ అనే సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి నిర్మాత అల్లు అరవింద్ గారు. మాకు మూడు మంచి హిట్స్ ఇచ్చారు. 100% లవ్, మోస్ట్ ఎలిజీబుల్ బ్యాచిలర్, తండేల్. ఇందాక ఎవరో అన్నాడు అల్లు -అక్కినేని అని.. మాకు అలా సెట్ అయ్యింది.

చందూ మొండేటి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటినుంచే  కాదు మొదటినుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చైతన్య కోసం నువ్వేదైతే అది చాలా అద్భుతం. తనలో ఉన్న ఒక నటుడిని  బయటకు తీసుకొచ్చావ్. ఆ లాస్ట్ 10 మినిట్స్ చాలా బాగా తీసావ్. చైతో పెంటాస్టిక్ గా యాక్ట్ చేయించావ్. హీరో క్యారెక్టర్ ను లిఫ్ట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. చందూ ఒక సీన్ అనే కాదు .. సినిమా మొత్తం అద్భుతంగా చూపించావ్.

Chandoo Mondeti: చైతన్యతో ఒక హిస్టారికల్ సినిమా చేస్తున్నా.. ఏఎన్నార్ నటించిన ఆ సినిమాకు రీమేక్..?

సాయిపల్లవితో పాటు చైతూ క్యారెక్టర్ ను అక్కడ నిలబెట్టావ్. నువ్వు మాకు ప్రేమను ఇచ్చావు.. మేము నీకు అంతకుమించిన ప్రేమను ఇస్తున్నాం. రాక్ స్టార్ డిఎస్పీ. నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎన్ని సినిమాలు చేసాం. మొన్న నాగ్ సర్ తో లవ్ స్టోరీ అని చెప్పావట ఎవరో డైరెక్టర్ తో.. ఇప్పుడు ఎలా కుదురుతుంది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చావు. పెంటాస్టిక్ దేవి. థాంక్యూ సో మచ్. మై రాక్ స్టార్ దేవి.

ఇక సాయి పల్లవి ఒక అపురూపమైన నటి. ఆమె నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ పెంటాస్టిక్. సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తే  ఒక్క సాయిపల్లవి కనపడదు.. పది సాయిపల్లవిలు కనపడుతూ ఉంటాయి. అంత బాగా డ్యాన్స్ చేస్తుంది.

చైతన్య షూటింగ్ కు వెళ్తూ వస్తూ ఉండేవాడు. 2 ఏళ్లు కమిట్ అయ్యాడు. ఫుల్ గడ్డం, జుట్టు.   ఫేస్ మారుతూ వస్తుంది. ఎరా కష్టంగా ఉందా అంటే లేదు నాన్న బాగానే ఉంది. ఒకరోజు షూటింగ్ ఎక్కడ అంటే.. సముద్రంలో అన్నాడు. ఎలా ఉంది అంటే చాల కష్టంగా ఉంది అన్నాడు. ఇప్పుడు అర్ధం అవుతుంది.. జాలరులు పడే కష్టం చూసి అన్నాడు. అసలు ఎలా  ఉండగలుగుతారు. నెలలు నెలలు సముద్రంలోకి వెళ్ళిపోయి.. ఆ చిన్న బోట్స్ లో.. ఎలా ఉంటారు.. ? ఏం చేస్తారు.. ? ఆలోచిస్తుంటూనే అర్ధం కావడం లేదు. వాళ్లందరికీ దండం పెడుతున్నాను.

చైతన్య.. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాడి ముఖం మీద నవ్వు, హ్యాపీ నెస్ చూస్తుంటే. ఒక్క సీన్ అనే కాదు.. సినిమా మొత్తం చాలా కష్టపడ్డాడు. ఆ లుక్, నడక అలా మెయింటైన్ చేయడం.. ప్రతిదీ చాలా అద్భుతంగా చేశాడు. క్లైమాక్స్ ఎంత బాగా సెటప్ చేశావయ్యా చందూ. నాన్నగారు సినిమాలు చాలా చూసాను..  చైను చూసి నాన్నగారు గుర్తు వచ్చారు. అందరికీ థాంక్స్. 2025 లో ఇది ముహూర్తం. వస్తున్నాం.. కొడుతున్నాం.. థాంక్యూ”  అని ముగించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×