BigTV English

Changes in Team India Additions: శివమ్ దుబె అవుట్.. కొత్త బ్యాటర్ ఇన్.. టీమ్ ఇండియాలో మార్పులు- చేర్పులు!

Changes in Team India Additions: శివమ్ దుబె అవుట్.. కొత్త బ్యాటర్ ఇన్.. టీమ్ ఇండియాలో మార్పులు- చేర్పులు!

Shivam Dube OUT, Samson Or Jaiswal In..? Changes in Team India Additions T20 WC 2024: టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఇంతవరకు రెండు మ్యాచ్ లు ఆడి, రెండు గెలిచింది. కానీ జట్టులో చాలా లోపాలున్నాయి. ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ వాటిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వచ్చిన తర్వాత ఫస్ట్ డౌన్ లో కీలక బ్యాటర్ లేడు. దీంతో జట్టు ఇన్ బ్యాలన్స్ అయ్యి, సముద్రంలో పడవలా ఊగిసలాడుతోంది.


రిషబ్ పంత్ ఓకేగానీ, తనది అంతా ఎటాకింగ్ ప్లే. ధోనీలా బెస్ట్ ఫినిషర్ గా ఉంటాడు. అంతేకానీ ఫస్ట్ డౌన్ లో వచ్చి జట్టు భారాన్నంతా మోయలేడు. టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఫస్ట్ ఈ నిజాన్ని గ్రహించింది.

అందుకని ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. రిజర్వ్ లో ఉన్న సంజూ శాంసన్ లేదా యశస్వి జైశ్వాల్ గానీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు ఓపెనర్లుగా రోహిత్ శర్మతో వీరిద్దరిలో ఒకరు వెళతారు. కొహ్లీ ఎప్పటిలా ఫస్ట్ డౌన్ లో వచ్చి, జట్టు పరిస్థితులకు అనుగుణంగా ఆడతాడు. కుర్రాళ్లకు మార్గదర్శకంగా ఉంటాడు. మ్యాచ్ ని సమర్థవంతంగా నడిపిస్తాడు. ఇది కాన్సెప్ట్.


Also Read: దక్షిణాఫ్రికా ‘మహరాజ్’.. బంగ్లాదేశ్ పై గెలిపించిన మనవాడు

వీరిద్దరిలో ఒకరు రావాలంటే, ఒకరు జట్టులోంచి వెళ్లాలి. ఆ వెళ్లేది ఎవరంటే, శివమ్ దుబె అని అంటున్నారు. అలా చేస్తే, జట్టులో సమతుల్యత వస్తుంది. అప్పుడు మొదట నుంచి స్పెషలిస్టు బ్యాటర్లు ఉంటారు. అంటే..

ఓపెనర్లు రోహిత్ శర్మ, సంజూ శాంసన్ / యశస్వి, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రా, అర్షదీప్, సిరాజ్ ఇలా సీక్వెన్స్ వస్తుంది. ఇప్పుడు చూసేందుకు కళ్లకు నిండుగా ఉంది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్ లు యూఎస్ఏ, కెనడాతో ఉన్నాయి. ఇక్కడే చేయాల్సిన ప్రయోగాలు చేసి, సూపర్ 8కి వెళ్లాలని సీనియర్లు సూచిస్తున్నారు.

Related News

Ganesh Idol : RCB ట్రోఫీతో బొజ్జ గణేష్… మళ్లీ తొక్కి సలాట జరగడం గ్యారంటీ అంటూ ట్రోలింగ్ !

Toyota -Team India : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఎవరంటే?

RJ Mahvash : శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం.. చాహల్ కు షాక్ ఇచ్చిన RJ మహ్వాష్

Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Harshit Rana : గంభీర్ ఎంతకు తెగించాడు రా.. ఏకంగా హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ?

Big Stories

×