BigTV English

Indresh Malik: ఆ హీరోయిన్ తో ఇంటిమేట్ సీన్స్ భయమేసింది.. ఆమె తల్లి ఎంకరేజ్ చేసి మరీ చేయించింది

Indresh Malik: ఆ హీరోయిన్ తో ఇంటిమేట్ సీన్స్ భయమేసింది.. ఆమె తల్లి ఎంకరేజ్ చేసి మరీ చేయించింది

Indresh Malik: ఈ మధ్యకాలంలో ఇంటిమేటెడ్ సీన్స్ చాలా కామన్ గా మారిపోయాయి. ఒకానొక సమయంలో ఇంటిమేటెడ్ సీన్స్ చేయడానికి హీరోయిన్స్ భయపడేవారు. ఇప్పుడు హీరోలు, నటులు భయపడుతున్నారు. కారణం ఏదైనా.. ఆ సీన్స్ చేస్తున్నంతసేపు తాము భయపడతామని చాలామంది నటులు చెప్పుకొచ్చారు. తాజాగా బాలీవుడ్ నటుడు ఇంద్రేష్ మాలిక్ సైతం ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన హీరామండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ఈ సిరీస్ లో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలందరూ ఉన్నారు.


సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సైగల్, సంజీదా షేక్ కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన రోజు నుంచి ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ నే వస్తుంది. ఇందులో ఇంటిమేటెడ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఉస్తాద్ జీ పాత్రలో ఇంద్రేష్ కనిపించాడు. ఈ సిరీస్ మొత్తంలో ఇతని పాత్ర చాలా కీలకం. సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్ చేసింది ఇతనే. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు తాను భయపడ్డానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

” సోనాక్షితో నాకు ఇంటిమేటెడ్ సీన్ ఉందని చెప్పారు. ఆ షూటింగ్ సమయంలో నేను చాలా భయపడ్డాను.. కొంచెం సిగ్గు పడ్డాను కూడా.. నా నెర్వస్ నెస్ చూసిన సోనాక్షి దగ్గరకు వచ్చి ఏం కాదు రిలాక్స్ గా చేయండి అని చెప్పింది. ఆమెతో పాటు ఆ సీన్ షూట్ చేసేటప్పుడు సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా కూడా అక్కడే ఉన్నారు. కథకు ఈ సీన్స్ ఎంతో అవసరం. కంగారు పడకండని ఒక గంట మొత్తం చర్చించి షూటింగ్ ఫినిష్ చేశాం. అలా చర్చించుకొని షూట్ చేసాం కాబట్టే ఎక్కువ రీటేక్ లు తీసుకోలేదు.


ఇదే కాదు.. సోనాక్షీ నా తలను ఆమె కాళ్లతో టచ్ చేసే సీన్ కూడా ఎంతో భయంగా చేశాను. అప్పుడు పూనమ్ సిన్హా దైర్యం చెప్పారు. ఈ పాత్ర కోసం నేను ఎంతో కష్టపడ్డాను. నాకోసమే సంజయ్ సర్ ఈ పాత్రను రాసాను అనుకుంటాను” అంతో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నెట్ ఫ్లిక్స్ లో హీరామండీ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×