BigTV English

Deals of the Week: కొత్త ఫోన్ కొంటున్నారా..? ఈ ఫోన్ల ధర చాలా తక్కువ ఫీచర్లు ఎక్కువ.. డోంట్ మిస్ ఇట్!

Deals of the Week: కొత్త ఫోన్ కొంటున్నారా..? ఈ ఫోన్ల ధర చాలా తక్కువ ఫీచర్లు ఎక్కువ.. డోంట్ మిస్ ఇట్!

Best Deals of The Week on Mobiles: మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అది కూడా తక్కువ ధరలోనా? అయితే అమెజాన్ మీకోసం ఈ వారం టాప్ డీల‌్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ డీల్‌లో స్మార్ట్‌ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు లభిస్తాయి. మీరు శామ్‌సంగ్, ఐటెల్, పోకోతో సహా అనేక కంపెనీల నుండి స్మార్ట్‌ఫోన్‌లను రూ.6 నుండి 10 వేలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లలో 12 GB RAM,50 మెగాపిక్సెల్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉంటుంది. అయితే ఈ ఫోన్లలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ఏ ఆఫర్లు అందుబాటుులో ఉన్నాయో తెలుసుకుందాం.


POCO M6 5G
4 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ Poco ఫోన్ అమెజాన్ డీల్‌లో రూ. 8,999కి దక్కించుకోవచ్చు. ఈ ఫోన్‌పై రూ.250 కూపన్ డిస్కౌంట్ ఇస్తోంది. మీరు దీన్ని రూ. 450 వరకు క్యాష్‌బ్యాక్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై రూ. 8500 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే మీరు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD + డిస్‌ప్లే ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

itel A70
ఈ ఐటెల్ ఫోన్‌లో 4GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఫోన్ ధర రూ.6,799 అయితే మీకు బ్యాంక్ ఆఫర్‌లో రూ. 850 డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 340 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. రూ. 6,450 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ అందుబాటులో ఉంది. స్టార్టింగ్ రూ. 330తో EMI వద్ద సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే మెమరీ ఫ్యూజన్‌తో ఫోన్‌లో 12 GB వరకు RAM సపోర్ట్ ఉంటుంది. ఫోన్ HD+ డిస్‌ప్లే 6.56 అంగుళాలు, ఇది డైనమిక్ బార్‌తో వస్తుంది.  ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.


Also Read: ఆహా దొరికింది.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.25 వేల డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్లు ఎలా ఇస్తారు!

Samsung Galaxy M14 5G
4 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్ రూ.9,490కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌పై దాదాపు రూ.475 క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. రూ.8700 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ Samsung ఫోన్ 1080 x 2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది.  Exynos 1330 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. పవర్ కోసం 6000mAh బ్యాటరీ ఉంది.

Tags

Related News

Smartphone Tips: మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Prepaid Cards: ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డు.. క్రెడిట్ స్కోర్ అవసరం లేకుండా సులభ లావాదేవీలు

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Big Stories

×