BigTV English

Sonali Bendre: మహేష్ ఫ్యాన్స్ దెబ్బ.. మురారి హీరోయిన్ అబ్బా.. చెప్పేసిందిగా

Sonali Bendre: మహేష్ ఫ్యాన్స్ దెబ్బ.. మురారి హీరోయిన్ అబ్బా.. చెప్పేసిందిగా

Sonali Bendre: ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి రీరిలీజ్ అయిన విషయం విదితమే. థియేటర్ లో మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొంతమంది ఈ సినిమాకు అక్షింతలు తీసుకొని వెళ్లగా.. ఒక జంట అయితే ఏకంగా థియేటర్ లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. అంతలా మురారిని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసారు.


ఇక ప్రతి రీరిలీజ్ సినిమాకు అందులో నటించిన హీరోలు, హీరోయిన్స్.. అప్పుడు సెట్ లో జరిగిన పథ విషయాలను నెమరువేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తారు. మురారి రీరిలీజ్ కు ముందు హీరోయిన్ సోనాలి బింద్రే ఒక వీడియోలో మాట్లాడి మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన విషయం తెల్సిందే.

మురారి సినిమా గురించి సోనాలి మాట్లాడుతూ.. డైరెక్టర్ కృష్ణవంశీ గురించి చెప్పుకొచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ నందిని రెడ్డి తనకు తెలుగు బాగా నేర్పించిందని, ఆమె తనకు మంచి స్నేహితురాలిగా మారిందని, మురారి వలన తనకు మంచి ఫ్రెండ్ దొరికిందని చెప్పుకొచ్చింది.


ఇక మొత్తం వీడియోలో మహేష్ పేరును ఎక్కడా చెప్పలేదు. ఏ హీరోయిన్ అయినా తన మొదటి హీరో గురించి, సినిమా గురించి చెప్పడానికి ఎప్పుడు వెనుకాడదు. కానీ, సోనాలి.. మహేష్ పేరును మరిచిపోవడంతో ఇది బాబును అవమానించడమే అని ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. అసలు ఈమె హీరోయినా.. ? హీరో గురించి చెప్పదేంటి అని కామెంట్స్ చేశారు.

ఇక ఆ ట్రోలింగ్ సోనాలి వరకు వెళ్లినట్లు ఉంది. తాజాగా మురారి రీరిలీజ్ అయ్యాక.. ఫ్యాన్స్ రియాక్షన్ వీడియోను షేర్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ఈసారి మహేష్ గురించి ముందే చెప్పుకొచ్చింది. “మహేష్ తో మురారి లాంటి సినిమా చేసినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఆ సమయంలో నందిని లాంటి ఫ్రెండ్ ను పొందడం ఒక సర్ ప్రైజ్. 23 ఏళ్ళ తరువాత కూడా ఇలాంటి అద్భుతమైన ప్రేమను చూడడం ఆనందంగా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఇక ఇలాంటి ఒక స్పెషల్ సినిమాను మాకు అందించినందుకు వంశీగారికి ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ తో మహేష్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఇప్పుడు కూడా మహేష్ నేమ్ చెప్పకపోతే ఇంకా ట్రోలింగ్ బారిన పడతానేమో అని సోనాలి ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×