Sonam Kapoor: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ (Sonam Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సోనమ్ కపూర్ మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడాలని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆమె మాట్లాడారు. 2018 బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్ కపూర్.. అందులో భాగంగానే తన స్నేహితురాలు తీవ్ర వేధింపులకు గురైనట్లు తెలిపింది. ఆ స్నేహితురాలి పేరు చెప్పని సోనమ్ కపూర్ ఇలా మాట్లాడుతూ.. ఏడుగురు తోబుట్టులతో కూడిన కుటుంబానికి ఆమె ఆధారం. కాబట్టే ఇండస్ట్రీలో ఈ విషయాలు చెప్పలేదని, ఒకవేళ చెబితే బాధితురాలుగా ముద్ర వేస్తారని భయపడిందని తెలిపింది. ఆ స్నేహితురాలు ఎవరో కాదు కత్రినా కైఫ్ (Katrina Kaif) అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి సోనమ్ పేర్లు చెప్పకపోయినా ఏడుగురు తోబుట్టువులు అన్నమాటతో కత్రినా కైఫ్ గురించి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
కత్రినా కైఫ్ పర్సనల్ విషయాలపై సోనమ్ కామెంట్స్..
ఇకపోతే సోనమ్ కపూర్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం చెప్పిందా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. వేధింపుల గురించి తాను బహిరంగంగా మాట్లాడి తన కెరియర్ను పాడు చేసుకోదల్చుకోలేదని, తాను తన ఏడుగురు తోబుట్టువులు బాగోగులు చూసుకోవడం కోసమే ఇండస్ట్రీలో ఏం జరిగినా సర్దుకుపోతున్నానని కత్రినా కైఫ్, సోనమ్ కి చెప్పినట్లు సోనం కపూర్ పరోక్షంగా తెలిపింది. ఇక సోనమ్ తన స్నేహితురాలి గుర్తింపును పరోక్షంగా వెల్లడించడంతో కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొంతమంది ఆమె వర్ణనతో అది ఎవరో సులభంగా ఊహించవచ్చని నవ్వుతూ కామెంట్లు చేస్తున్నారు .ఏది ఏమైనా సోనమ్ కపూర్ మాత్రం కత్రినా కైఫ్ పర్సనల్ విషయాలను ఇలా బయట పెట్టడంతో కత్రినా కైఫ్ అభిమానులు సోనమ్ పై మండిపడుతూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.ఏది ఏమైనా సోనమ్ కపూర్ మాత్రం తన స్నేహితురాలి గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సోనమ్ కపూర్ కెరియర్..
సోనమ్ కపూర్ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా పేరు దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఏకంగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులకు నామినేషన్లు కూడా లభించాయి. సోనమ్ కపూర్ ఎవరో కాదు ప్రముఖ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor)కుమార్తె. సింగపూర్ లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్ ఆర్ట్స్ చదువుకున్న ఈమె.. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. అలాగే భన్సాలీ దర్శకత్వం వహించిన సావరియా అనే సినిమా ద్వారా 2007లో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాతో ఉత్తమ డెబ్యూ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఇంకా సోనమ్ కపూర్ వివిధ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది .బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి అవగాహన కార్యక్రమాలు చేసిన ఈమె ఎన్నో బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.