BigTV English

Kiara Advani: వెరైటీ డ్రెస్‌లో కియారా.. ధర తెలిస్తే మామూలుగా ఉండదు, షాకవ్వాల్సిందే.!

Kiara Advani: వెరైటీ డ్రెస్‌లో కియారా.. ధర తెలిస్తే మామూలుగా ఉండదు, షాకవ్వాల్సిందే.!

Kiara Advani: హీరోహీరోయిన్లు ధరించే డ్రెస్సులు సింపుల్‌గా ఉండకూడదు. ముఖ్యంగా అందరూ తమ రోజూవారీ జీవితాల్లో ధరించే డ్రెస్సుల్లాగా అస్సలు ఉండకూడదు. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు చాలా కష్టపడి సినీ సెలబ్రిటీల కోసం వెరైటీ డ్రెస్సులు రెడీ చేస్తుంటారు. అలాగే ఆ డ్రెస్సులు రెడీ చేయడం అంత ఈజీ కాదు. దానికోసం చాలా కష్టపడతారు, ఖర్చుపెడతారు. తాజాగా కియారా అద్వానీ కూడా ఒక వైట్ కలర్ వెరైటీ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేయగా అందులో తను చాలా బాగుందంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఆ డ్రెస్ తనకే బాగా సెట్ అయ్యిందంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ ఈ ధర తెలిసి అందరూ షాకవుతున్నారు.


ధర ఎంతంటే?

కియారా అద్వానీ ఇటీవల ధరించిన డ్రెస్‌ను వైట్ వాలెంటినో ఎంబ్రాయ్డెడ్ క్రీప్ కార్చుర్ షార్ట్ డ్రెస్ అంటారు. ఇది చూసి వెరైటీగా ఉందని ఫాలోవర్స్ అనుకున్నా కూడా కియారాకు మాత్రం బాగా సూట్ అయ్యిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఈ డ్రెస్‌ ధర 8,106 డాలర్లు అని తెలిసి షాకవుతున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దీని ప్రైజ్ రూ.7,01,776.54. లగ్జరీ, గ్లామర్‌తో కలగలిపిన ఈ డ్రెస్ ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఫ్యాషన్ అంటే ఇలాగే ఉంటుందని, వెరైటీగా కనిపించినా కూడా కాస్ట్‌లీగా ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మొత్తానికి కియారా డ్రెస్ కాస్ట్ ప్రస్తుతం ఫ్యాషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


కమర్షియల్ హీరోయిన్

కియారా అద్వానీ సినిమాల విషయానికొస్తే.. తను చివరిగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకులను పలకరించింది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి మిక్స్‌డ్ టాక్ లభించింది. పైగా ప్రతీ కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌లాగా ‘గేమ్ ఛేంజర్’లో కూడా కియారా అద్వానీ రోల్ పాటల వరకే పరిమితం అయ్యింది. హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ఏడాదికి కనీసం ఒకటి లేదా కుదిరితే రెండు సినిమాలతో కూడా పలకరించిన కియారా.. 2024లో మాత్రం గ్యాప్ తీసుకుంది. అలా 2025ను ‘గేమ్ ఛేంజర్’తో గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పింది.

Also Read: షారుఖ్‌తో క్లాసిక్ హిట్ మిస్ చేసుకున్న మహేశ్ హీరోయిన్.. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం లాభం.?

రెండు పెద్ద సినిమాలు

2025లో కియారా అద్వానీ (Kiara Advani) నటించిన రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టనుంది ఈ ముద్దుగుమ్మ. యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’లో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేయకపోయినా.. సెట్‌లో యశ్, కియారా కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఒక డ్యూయెట్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. ఇది మాత్రమే కాకుండా కియారా చేతిలో ‘వార్ 2’ కూడా ఉంది. ఎన్‌టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చేస్తున్న సినిమా కావడంతో ‘వార్ 2’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హృతిక్‌కు జోడీగా కియారా కనిపించనుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×