VishwakSen Laila:యంగ్ హీరోగా, డైరెక్టర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (VishwakSen). ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు మీదున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం లైలా (Laila). రామ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్ , ఎస్ఎంటి అర్చన ప్రెజెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్గా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)నటిస్తోంది. లవర్స్ డే సందర్భంగా వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే వరుసగా అప్డేట్లు వదులుతూ సినిమాపై అంచనాలు భారీగా పెంచుతోంది.
లైలా నుండి సోను మోడల్..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి “సోను మోడల్” అంటూ ఒక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో విశ్వక్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. మోడ్రన్ లుక్ లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించగా, బ్రహ్మ కడలి ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రీచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇకపోతే ఇటీవల క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుండి విశ్వక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఇప్పుడు వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఇందులో మొదటిసారి విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారు.
లిరిక్స్ అందించిన విశ్వక్ సేన్..
ఇకపోతే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.. ఈ సోను మోడల్ అనే పాటకు లిరిక్స్ అందించింది కూడా విశ్వక్ కావడం గమనార్హం. ఈ విషయం తెలిసి ఆయనలోని టాలెంట్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా విశ్వక్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్ అని, అందుకే ఆయన చేసే ప్రతి పని కూడా అలాగే ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
విశ్వక్ సేన్ కెరియర్..
విశ్వక్ సేన్.. తెలుగు సినిమా నటుడి గానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా పేరు దక్కించుకున్నారు. ఈయన అసలు పేరు దినేష్ నాయుడు. హైదరాబాదులో పుట్టి పెరిగారు. 2017 లో ‘వెళ్ళిపోమాకే’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన, ఆ తర్వాత 2018 లో ఈ ‘నగరానికి ఏమైంది’ అనే సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నారు. 2019లో వచ్చిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రానికి ఏకంగా నటుడు గానే కాకుండా దర్శకుడిగా, రచయితగా, సహా నిర్మాతగా కూడా వ్యవహరించి తనలోని టాలెంట్ ను పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం వంటి చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్న విశ్వక్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక త్వరలో లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.