BigTV English

Balakrishna: బాలకృష్ణ 100వ మూవీ ఆ డైరెక్టర్ తో చేయాల్సిందా.. కట్ చేస్తే..!

Balakrishna: బాలకృష్ణ 100వ మూవీ ఆ డైరెక్టర్ తో చేయాల్సిందా.. కట్ చేస్తే..!

Balakrishna:నటసింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna) చివరిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. కూతుర్ని ధైర్యవంతురాలిగా మార్చే పాత్రలో బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కంటే ముందే అనిల్ రావిపూడి, బాలకృష్ణతో ఒక సినిమా చేయాలనుకున్నారట. అది కూడా బాలకృష్ణ 100వ సినిమాగా చేయాలనుకున్నారట. ఇక ఆ చిత్రానికి ‘రామారావు’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. దిల్ రాజు( Dilraju)తో కలిసి బాలయ్యకి స్టోరీ లైన్ కూడా వినిపించారు. అయితే అప్పటికి ఇంకా స్టోరీ కంప్లీట్ కాలేదు.”నాకు నచ్చని ముఖం చూస్తే మైండ్లో నరం కట్ అవుతుంది. ఇలాగే వైల్డ్ గా రియాక్ట్ అవుతా” అనే డైలాగ్ చెప్పారు అనిల్ రావిపూడి. ఈ డైలాగు బాలకృష్ణకు విపరీతంగా నచ్చేయడంతో సినిమా చేద్దామని కూడా అనుకున్నారట. కానీ కొన్ని కారణాలవల్ల బాలయ్య 100వ చిత్రాన్ని అనిల్ రావిపూడి తో చేయలేకపోయారు. కానీ బాలకృష్ణ తన 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను తెరకెక్కించారు.


బాలయ్య 100వ చిత్రం అనిల్ రావిపూడి చేయా ల్సిందా..?

ఇకపోతే బాలకృష్ణతో సినిమా చేయాలనే తన కల అలాగే నిలిచిపోవడంతో ఎలాగైనా సరే బాలయ్యతో సినిమా చేయాలనుకున్న అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా చేసి తన కోరిక తీర్చుకున్నారు. ఇకపోతే బాలయ్య 100వ చిత్రంగా తెరకెక్కించాలనుకున్న చిత్రంలో బాలయ్యను పోలీస్ ఆఫీసర్ గా చూపించాలనుకున్నారట అనిల్ రావిపూడి. అయితే అప్పుడు కుదరక ఆ క్యారెక్టర్ ని భగవంత్ కేసరిలో పెడితే ఎలా ఉంటుంది? అని ఆలోచించి వెంటనే ఆ పాత్రని అమలు చేసినట్లు సమాచారం. ఎప్పటికైనా బాలయ్యతో ‘రామారావు’ అనే టైటిల్ తో సినిమా చేయాలని అనిల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే బాలకృష్ణ తండ్రి పేరు కాబట్టి సెంటిమెంట్ గా కూడా ఉంటుంది కానీ ఆల్రెడీ ఆ టైటిల్ తో రవితేజ(Raviteja ) సినిమా చేసేశారు. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.


బాలకృష్ణ సినిమా..

ప్రస్తుతం బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ బాబీ (Bobby) దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఎలివేషన్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని నిర్మాత ఆల్రెడీ హైప్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా యావరేజ్ గా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. జనవరి 12వ తేదీన వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని బాలయ్య అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒకవైపు హీరోగా మరొకవైపు రాజకీయవేత్తగా ఇంకొక వైపు హోస్ట్ గా దూసుకుపోతున్నారు. ఇటీవలే ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వేదికపై సందడి చేసి తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు సీజన్ ఫోర్ నడుస్తూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×