E-Paper
Advertisement

Sonu Sood Deep Fake Video : డీప్‌ ఫేక్‌ బారిన సోనూసూద్‌.. వీడియోలతో ఫ్యాన్స్‌కు సైబర్ నేరగాళ్ల వల ..

Sonu Sood Deep Fake Video : డీప్‌ ఫేక్‌ బారిన సోనూసూద్‌..  వీడియోలతో ఫ్యాన్స్‌కు సైబర్ నేరగాళ్ల వల ..
Advertisement

Sonu Sood Deep Fake Video : ఎంతో మంది ప్రముఖుల ముఖాలను డీప్ ఫేక్ చేసి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖుల డీప్‌ ఫేక్‌ వీడియోల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ చేరారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఆయన కష్టసమయాల్లో అండగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకున్నారు. కొందరు ఆకతాయలు ఇప్పుడు ఆయన ఫేక్‌ వీడియోను రూపొందించి అభిమానులను డబ్బులు అడుగుతున్నారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సోనూసూద్‌ తన సోషల్‌ మీడియా ద్వారా సూచించాడు.

‘కొందరు నా డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసి అభిమానులతో చాటింగ్‌, వీడియో కాల్‌ చేసి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. చాలా మంది అమాయకులు ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకుని సైబర్‌ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్‌ వస్తే నమ్మకండి.. జాగ్రత్తగా ఉండండి’ అని ఆయన అభిమానులను కోరారు. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే.. ‘ఫతే’ (FATEH) సినిమా తీస్తున్నట్లు చెప్పారు. డీప్ ఫేక్‌, లోన్‌ యాప్స్‌ వల్ల జరుగుతున్న సైబర్‌ నేరాలను అందులో చూపిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

ఇటీవల డీప్ ఫేక్ వీడియో ఘటనలు చాలా జరిగాయి. రష్మిక డీప్‌ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రా కూడా డీప్ ఫేక్‌ వీడియోల బారిన పడ్డారు. తాజాగా సచిన్‌ కూడా దీని బారిన పడ్డారు. ఇప్పటికే వీటిపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×