E-Paper
Advertisement

Sonu Sood Meet Kumari aunty: కుమారి ఆంటీకి బాలీవుడ్ హీరో సోనూ సూద్ సర్ ప్రైజ్.. వీడియో వైరల్

Sonu Sood Meet Kumari aunty: కుమారి ఆంటీకి బాలీవుడ్ హీరో సోనూ సూద్ సర్ ప్రైజ్.. వీడియో వైరల్
Advertisement

Sonu Sood Meet Kumari aunty: హైదరాబాద్‌లో ఫుడ్ వ్యాపారంలో ‘రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మీ బిల్లు రూ.1000’ అనే డైలాగ్‌తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ బాగా ఫేమస్ కావడంతో ఫుడ్ సెంటర్ వద్దకు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలనుంచి వచ్చారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి పోలీసులు ఫుడ్ వ్యాపారంపై చర్యలు తీసుకున్నారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అక్కడే ఫుడ్ వ్యాపారం చేసుకునేలా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిన కుమారి ఆంటీ..స్వయంగా సీఎం ఫుడ్ స్టాల్ నిర్వహించుకునేందుకు అనుమితి ఇవ్వడంతో ఒక్కసారిగా క్రేజీ పెరిగిపోయింది. తర్వాత న్యూస్ పేపర్స్, టీవీల్లోనే కనిపించారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ రావడంతో సెలబ్రెటీ అయిపోయింది. దీంతో ఆమెకు పలు సీరియల్స్, షోస్‌లో అవకాశం రావడంతో సందడి చేసింది.

Advertisement

ఇదిలా ఉంటే.. తాజాగా, కుమారీ ఆంటీని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కలిశారు. హైదరాబాద్‌లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సోనూ సూద్ నేరుగా వెళ్లి సందడి చేశారు. నేను వెజ్ మాత్రమే తింటానని, నాకేమైనా డిస్కౌంట్ ఉందా అని అడగగా.. అలా ఏం లేదు సార్.. మీరు ఏం తిన్న ఫ్రీగా ఇస్తామనని కుమారి ఆంటీ చెప్పింది. కరోనా సమయంలో మీరు చేసిన సహాయం చాలా పెద్దదని, ఎంతో మందిని ఆదుకున్నారని, మీకు మేము ఇచ్చినా.. తక్కువేనని చెప్పుకొచ్చారు.

Also Read: కుబేర మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

Advertisement

అనంతరం సోనూ సూద్ ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఫుడ్ స్టాల్ పెట్టుకొని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్నారని ఆమెను అభినందించారు. అనంతరం ఆమెకు స్వయంగా భోజనం వడ్డించారు. కుమారి ఆంటీ స్త్రీ శక్తికి నిదర్శనమని, కష్టపడితే ఫలితం ఉంటుందని చెప్పడానికే మీరే నిదర్శమన్నారు. స్వయంకృషితో పనిచేసే మీలాంటి వారిని సపోర్ట్ చేద్దామన్నారు. కాగా, తన ‘ఫతేహ్’ సినిమాకి సెలబ్రిటీగా రావాలని కుమారి ఆంటీని సోనూ సూద్ ఆహ్వానం అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×