E-Paper
Advertisement

Sonu Sood : టార్గెట్ చేశారు… కఠిన చర్యలు తప్పవు… అరెస్ట్ వారెంట్ వార్తలపై సోనూసూద్ వార్నింగ్

Sonu Sood : టార్గెట్ చేశారు… కఠిన చర్యలు తప్పవు… అరెస్ట్ వారెంట్ వార్తలపై సోనూసూద్ వార్నింగ్
Advertisement

Sonu Sood : ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood) పై లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ వారెంట్ పై స్పందిస్తూ సోనూ సూద్ సంచలన కామెంట్స్ చేశారు. తనను టార్గెట్ చేశారని అంటూనే, తనను టార్గెట్ చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోనూసూద్ పై అరెస్టు వారెంట్

Advertisement

కరోనా కష్ట సమయంలో సహాయం చేసి రియల్ హీరో అన్పించుకున్న బీ టౌన్ నటుడు సోనూ సూద్ (Sonu Sood) పై అరెస్టు వారెంట్ జారీ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఫ్రాడ్ కేసు. లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా ఈ కేసు వేశారు. అందులో మోహిత్ శుక్లా అనే వ్యక్తి తన దగ్గర 10 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆ కేసులో పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో తనను నమ్మించి, తన దగ్గర నుంచి 10 లక్షలు కాజేసాడంటూ ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా పేర్కొంటూ, సాక్ష్యం చెప్పమని సోనుసూద్ కి కోర్టు సామాన్లు జారీ చేసింది.

కానీ సోనూ (Sonu Sood) దీనికి సంబంధించి కోర్టులో హాజరు కాకపోవడంతో తాజాగా ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను ఈ నెల 13కి కోర్టు వాయిదా వేసింది. ఇక 10 లక్షల ఫ్రాడ్ కేసులో భాగంగా పంజాబ్లోని, లుథియానా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంపై తాజాగా సోనూ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

వారెంట్ పై సోనూ సూద్ రియాక్షన్…

తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో అసలు వివాదం ఏంటో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నటుడు సోనూ సూద్ (Sonu Sood). ఆ పోస్ట్ లో “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నాను. ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పాలంటే, నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి కేసు విషయంలో కోర్టు నన్ను సాక్షిగా హాజరు కావాలని పిలిచింది. కోర్టు ఆదేశాలపై మా న్యాయవాదులు ఇప్పటికే స్పందించారు. అలాగే ఫిబ్రవరి 10న ఈ కేసు విషయంలో మాకు సంబంధం లేదంటూ ఒక ప్రకటనను రిలీజ్ చేయబోతున్నాము. అనవసరంగా మీడియా ఈ వార్తలపై దృష్టి సారిస్తోంది. ఈ విషయాల్లో సెలబ్రేట్ చేయడం నిజంగా బాధాకరం. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను. కనీసం నేను దానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా కాదు. అలాగని వాళ్ళతో ఏ విధంగానూ అసోసియేట్ అవ్వలేదు” అంటూ సోనూ సూద్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

దీంతో అసలు సంబంధం లేని కేసులో సోనూ సూద్ ను సాక్షిగా ఎలా పిలిచారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోనూ సూద్ చేసిన పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×