Team India: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో మొదటి వన్డే గెలిచిన టీమిండియా రెండో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. అంటే ఫిబ్రవరి 9వ తేదీన కటక్ లోని భారామతి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు కటక్ లో ఆడిన వన్డేలలో టీమిండియా కు మంచి రికార్డే ఉంది.
Also Read: Anil Kumble: ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే…26 ఏళ్ల తర్వాత వీడియో వైరల్ !
అయితే కటక్ వేదికగా.. జరగబోయే రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రీసెంట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మోకాలి గాయంతో మొదటి వండేకు దూరమైన విరాట్ కోహ్లీ ఫిట్ అయ్యాడని తెలుస్తోంది. ఒకవేళ విరాట్ కోహ్లీ రెండో వన్డే ఆడితే… మొదటి వన్డేలో ఆడిన ఏ ప్లేయర్ ను తీసివేయాల్సి వస్తుంది అనే దానిపై కొత్తగా చర్చ జరుగుతోంది.
విరాట్ కోహ్లీ గాయంతో మొదటి వన్డేకు దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్ ను చివరి క్షణంలో రంగంలోకి తీసుకువచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే చివరి క్షణంలో టీమిండియాలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్… 50 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి… టీమిండియాను గెలిపించాడు శ్రేయస్ అయ్యర్. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ కంటే శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడని… అందరూ అనుకునేలా చేశాడు.
కాబట్టి రెండవ వన్డేలో విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చినప్పటికీ కూడా శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉంటాడని అందరూ అంటున్నారు. అయితే మొదటి వన్డే మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ ను రెండో వన్డేలో దూరం పెట్టబోతున్నారట. ఓపెనర్ గా గిల్ కు అవకాశం ఇచ్చే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు విరాట్ కోహ్లీ మళ్లీ మొదటి వికెట్ కు బ్యాటింగ్ చేయవచ్చు. ఇక విరాట్ కోహ్లీ తర్వాత శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: Sara Tendulkar: రగిలిపోతున్న సారా….గిల్ కు ఇవ్వాల్సిన ముద్దులు ఆమెకు?
మొత్తానికి విరాట్ కోహ్లీ… రీ ఎంట్రీ తో… ఈ ఇద్దరు యంగ్ క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చివరి క్షణంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడా లేదా జైస్వాల్ ఆడతాడా..? అనే టెన్షన్ కూడా ఉంది. ఇక ఈ విషయంపై కొంతమంది సీనియర్ క్రికెటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సీనియర్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటే… యంగ్ క్రికెటర్లకు మంచి అవకాశాలు వస్తాయని కూడా అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి వన్డే ఆడకపోవడంతో… శ్రేయస్ అయ్యర్ ప్రతాపం ఏంటో అందరూ చూశారు. దీంతో.. ఇప్పుడు అందరూ శ్రేయస్ అయ్యర్ జపం చేస్తున్నారు.