BigTV English
Advertisement

Prabhas : స్టార్ విత్ గోల్డెన్ హార్ట్.. డార్లింగ్ బర్త్ డే స్పెషల్..

Prabhas :  స్టార్ విత్ గోల్డెన్ హార్ట్.. డార్లింగ్ బర్త్ డే స్పెషల్..

Prabhas : ప్రభాస్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ అభిమానంగా డార్లింగ్ అని పిలుచుకునే హీరో. ఈశ్వర్ గా మన ముందుకు వచ్చి.. సినీ ఇండస్ట్రీలో తన నటనతో మిస్టర్ పర్ఫెక్ట్ గా మారి.. అభిమానుల దగ్గర డార్లింగ్ అనిపించుకొని.. పౌరుషంలో గుంటూరు మిర్చిని తలపించి.. టాలీవుడ్ కీర్తిని వరల్డ్ వైడ్ బాహుబలి గా ఫేమస్ చేసిన యాక్టర్ ప్రభాస్. అందుకే ఒక్క అడుగు.. అంటూ కదం తొక్కిన ఈ హీరోకి టాలీవుడ్ ఛత్రం పట్టి ఛత్రపతి ని చేసింది. మరి అలాంటి యాక్టర్ పుట్టినరోజు అంటే అభిమానులు ఎంత హడావిడి చేస్తారో కదా..


రాధే శ్యామ్ గా ప్రేమను పంచినా.. సాహో అంటూ సాహసం చేసినా.. ఆది పురుషుడిగా అవతారమెత్తిన అభిమానులు అతన్ని ఆదరించారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా.. టాలీవుడ్, కోలీవుడ్ , బాలీవుడ్ ఎక్కడైనా.. ప్రేక్షకులే కాకుండా తోటి నటులను కూడా తనకు అభిమానులుగా మార్చుకున్న ఘనత ప్రభాస్ కే సొంతం. రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ కే గుర్తింపు తెచ్చిన గొప్ప యాక్టర్ ప్రభాస్.

టాలీవుడ్ బాక్సాఫీస్ రేంజ్ ను బాహుబలి మూవీతో అమాంతం పెంచేశాడు ప్రభాస్. 100 కోట్లతో సరిపెట్టుకునే టాలీవుడ్ మార్కెట్ ను ఏకంగా రెండు వేల కోట్లకు పెంచేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సత్తాను ప్రపంచానికి చాటాడు. అందరూ అనుకున్నట్టు ప్రభాస్ కు సక్సెస్ అంత సులభంగా రాలేదు.


ఈశ్వర్ లో ఒక ఆకతాయి పిల్లాడిగా తన నటన మొదలుపెట్టిన ప్రభాస్.. త్రిష కాంబినేషన్లో వచ్చిన వర్షం మూవీతో మొదటి కమర్షియల్ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఛత్రపతిగా మాస్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు. డార్లింగ్ ,మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు అతనికి తిరుగులేని స్టార్ డమ్ అందించాయి. రాఘవేంద్ర, అడవి రాముడు, చక్రం లాంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకొని కాస్త నిరాశపరిచినా.. అభిమానులకు అతనిపై అభిమానం మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు.

ఇక పౌర్ణమి మూవీలో ప్రభాస్ వింటేజ్ గెటప్.. అతని నటన వేరే లెవెల్ లో ఉంటుంది. బాహుబలి తో పాన్ ఇండియన్ రేంజ్ స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. సినిమాల పరంగానే కాదు మనిషిగా కూడా ప్రభాస్ ఎంతో ఔన్నత్యం ఉన్న వ్యక్తి. ప్రభాస్ ఎక్కువ గుప్తదానాలు చేస్తాడు. 1650 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లోని భూమిని ప్రభాస్ దత్తత తీసుకున్నాడు. ఇక్కడ అతను తన తండ్రి పేరు మీద ఎకో పార్కు నెలకొల్పడానికి సాయం చేశాడు.

అభిమానుల పట్ల కూడా ప్రభాస్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాడు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఫస్ట్ సౌత్ హీరో గా ప్రభాస్ పేరు మీద ఓ రికార్డే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే.. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరో ప్రభాస్. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సలార్ చిత్రం నవంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది.

స్టార్ విత్ ఏ గోల్డెన్ హార్ట్.. డార్లింగ్ ప్రభాస్ కు.. బిగ్ టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×