BigTV English

OTT Movie : అసలైన జాంబీ మూవీ… అదిరిపోయే ట్విస్టులు, ఉత్కంఠను రేపే సీన్స్

OTT Movie : అసలైన జాంబీ మూవీ… అదిరిపోయే ట్విస్టులు, ఉత్కంఠను రేపే సీన్స్

OTT Movie : జాంబీల సినిమాలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వాళ్ళు చూడడానికి భయంకరంగా ఉన్నా కూడా, సర్వైవర్లు జోంబీల నుంచి తప్పించుకుని బ్రతకడానికి చేసే పోరాటం మామూలుగా ఉండదు మరి. అలాంటి మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? సినిమా పేరేంటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


కథలోకి వెళ్తే…

హయోసన్ హైస్కూల్‌లో జరిగే ఒక జాంబీ అపోకలిప్స్ కథ ఈ సిరీస్. సైన్స్ టీచర్, లీ బైయోంగ్-చాన్ (కిమ్ బైయోంగ్-చుల్) తన కొడుకు జిన్-సు (లీ మిన్-గూ)ను బెదిరింపుల నుండి రక్షించడానికి ఒక జోనాస్ వైరస్‌ను సృష్టిస్తాడు. ఇది అతన్ని బలవంతుడిగా మారుస్తుందని అనుకుంటాడు. కానీ ఆదేమో వేగంగా వ్యాపించే జాంబీ వైరస్‌ గా మారుతుంది. ఈ వైరస్ స్కూల్‌లో కూడా వ్యాపిస్తుంది. విద్యార్థులను, టీచర్లను కూడా జాంబీలుగా మారుస్తుంది.


ఇక ఇక్కడి నుంచి కథ నమ్ ఆన్-జో (పార్క్ జీ-హు), లీ చియోంగ్-సాన్ (యూన్ చాన్-యంగ్), చోయ్ నమ్-రా (చో యీ-హ్యున్), లీ సు-హ్యోక్ (లోమన్), యూన్ గ్వీ-నమ్ (యూ ఇన్-సూ) వంటి హయోసన్ హైస్కూల్ విద్యార్థుల బృందం చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు స్కూల్‌ నుంచి బయటపడటానికి, జాంబీల నుండి తమను తాము రక్షించుకోవడానికి తెలివితేటలను, ధైర్యాన్ని ఉపయోగిస్తారు. ఆన్-జో, చియోంగ్-సాన్ మధ్య నడిచే లవ్ స్టోరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అయితే నమ్-రా, క్లాస్ ప్రెసిడెంట్. కానీ ఆమె ఒక “హాంబీ” (సగం మనిషి, సగం జోంబీ)గా మారుతుంది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లు, క్యాంటీన్, రూఫ్‌టాప్‌లలో బారికేడ్‌లు నిర్మించి, డ్రోన్‌లు, ఆర్చరీ బాణాలు, ఇతర వస్తువులను ఆయుధాలుగా ఉపయోగించి జాంబీలతో పోరాడుతారు

అధికారులు, సైన్యం వైరస్ ను అరికట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆన్-జో తండ్రి నమ్ సో-జు (జియోన్ బే-సూ) ఫైర్‌ఫైటర్. ఆయనతో పాటు డిటెక్టివ్ సాంగ్ జే-ఇక్ (లీ క్యూ-హ్యుంగ్) విద్యార్థులను రక్షించడానికి ప్రయత్నిస్తారు. చివరకు బ్రతికింది ఎవరు? వాళ్ళు ఎలా బయటపడ్డారు? వైరస్ ను స్టాప్ చేయగలిగారా? అనేది తెరపై చూడాల్సిందే.

Read also : ప్రేమ పేరుతో సైకో పనులు… ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తూ… ఈ అరాచకం మామూలుగా లేదురా నాయనా

మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపిన సిరీస్
2022లో విడుదలైన దక్షిణ కొరియా జాంబీ అపోకలిప్స్ హారర్ టెలివిజన్ సిరీస్ ‘All of Us Are Dead’. నెట్‌ఫ్లిక్స్‌లో 2022 జనవరి 28న ఈ సిరీస్ విడుదలైంది. ఇది జూ డాంగ్-గీన్ రాసిన Now at Our School (2009–2011) అనే నవర్ వెబ్‌టూన్ ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ 12 ఎపిసోడ్‌లు ఉండగా, ఒక్కొక్కటి 53–72 నిమిషాల నిడివితో సాగుతుంది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మొదటి 30 రోజుల్లో 474.26 మిలియన్ గంటల వ్యూస్ సాధించింది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×