Sreeleela: కన్నడ ఇండస్ట్రీకి చెందిన శ్రీ లీల (Sreeleela) తొలిసారి రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది. ఆ తర్వాత రవితేజ (Raviteja ) హీరోగా నటించిన ‘ ధమాకా ‘ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. ఇకపోతే వరుస పెట్టి సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఓకే ఏడాది దాదాపు 9 చిత్రాలకు సైన్ చేసి రికార్డు సృష్టించింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఈమె నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచిందని చెప్పవచ్చు.
పుష్ప -2 లో ఐటమ్ సాంగ్..
ఇకపోతే బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో బాలయ్యకు కూతురుగా నటించిన ఈమె.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘ గుంటూరు కారం’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి పర్వాలేదనిపించింది. ఇకపోతే సినిమా అవకాశాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ‘పుష్ప -2’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీ లీల. వాస్తవానికి ఒక యాడ్ కోసం బన్నీతో జతకట్టిన ఈమె.. ఇప్పుడు ఏకంగా తెరపై కనిపించబోతోంది అని తెలిసి, అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఐటమ్ సాంగ్ కోసం రూ .2 కోట్లు..
నిన్న మొన్నటి వరకు చాలామంది హీరోయిన్స్ పేర్లు తెర పైకి రాగా.. చివరికి శ్రీ లీల ను ఫైనల్ చేశారు మేకర్స్. ఇకపోతే ఈ పాట కోసం శ్రీ లీల భారీగా పారితోషకం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాట కోసం శ్రీ లీల ఏకంగా రూ .2 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయం తెలిసి సాధారణంగా స్పెషల్ సాంగ్ కోసం కొంతమంది హీరోయిన్స్ రూ.2కోట్లు కూడా తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీ లీల ఇంత మొత్తంలో తీసుకోవడం ఇదే ఆశ్చర్యకరం అని అంటున్నారు.
కాంప్రమైజ్ అవ్వని డైరెక్టర్..
ఇక పుష్ప -2 సినిమా విషయానికొస్తే.. సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది. కేవలం 25 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర బృందానికి ఫీవర్ మొదలైంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా బడ్జెట్ విషయంలోనే కాదు పాత్రల ఎంపిక సన్నివేశాలు.. ఇలా ఏ చిన్న అంశంలో కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అందుకే మొదటి భాగంలో స్పెషల్ సాంగ్ కి ఎలాంటి క్రేజ్ అయితే లభించిందో.. ఇప్పుడు పుష్ప -2 లో కూడా అంతే పాపులారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కుంభస్థలమే టార్గెట్..
ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా హైదరాబాదులో ప్రారంభం అయింది. మేకింగ్ స్టిల్ ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో పుష్పరాజ్ కి పోటీగా విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ .1000 కోట్ల మార్కు దాటేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.