Sree Leela:ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.’ పెళ్లి సందD’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సైన్ చేసిన హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ సినిమాలతో సరైన సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు ఆ రేంజ్ హిట్టు కోసం ఆరాటపడుతోంది. అందులో భాగంగానే హిందీలో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) తో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నా.. దీనిపై మాత్రం శ్రీ లీల స్పందించలేదు. అయితే సడన్గా అభిమానులతో ఇన్స్టా వేదికగా ‘ఆస్క్ మీ ఏ క్వశ్చన్’ పేరుతో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అందులో భాగంగానే ప్రేమ పై తన అభిప్రాయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
ప్రేమపై శ్రీ లీల అలాంటి కామెంట్..
ఆస్క్ మీ ఏ క్వశ్చన్ సెషన్ లో భాగంగా ప్రేమ పై మీ అభిప్రాయం ఏంటి ? అని ప్రశ్నించగా.. “మీరు గనక ప్రేమలో పడితే.. గాలి కూడా చొరబడనంత గట్టిగా దాన్ని పట్టుకోవాలి. ముఖ్యంగా మీరు, మీ భాగస్వామి మధ్య ఊపిరి కూడా ఆడనంత గట్టిగా ఆ ప్రేమ నిలవాలి”అంటూ ప్రేమ పై కామెంట్లు చేసింది శ్రీలీల. ఇకపోతే శ్రీ లీల చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కొంపతీసి కార్తిక ఆర్యన్ తో ప్రేమలో ఉందా? అందుకే ఇలాంటి కామెంట్లు చేసిందా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ పై శ్రీ లీల ఎక్కడ స్పందించలేదు. కానీ కార్తీక్ తల్లి మాత్రం ఒక కార్యక్రమంలో పాల్గొని..” మంచి వైద్యురాలిని కోడలిగా తెచ్చుకోవాలని ఉంది” అని చెప్పడంతో శ్రీలీలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేసిందిమో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
శ్రీ లీల కెరియర్..
ఇక శ్రీ లీల విషయానికి వస్తే.. ఒకవైపు నటిగా రాణిస్తూనే మరొకవైపు ఎంబిబిఎస్ చదువుతున్న విషయం తెలిసిందే .చదువుతోపాటు కెరియర్ లో కూడా కొనసాగడంపై చాలా సంతోషం గా ఉందని, ఎన్నో సందర్భాలలో వ్యక్తం చేసింది కూడా. అంతేకాదు చిన్నవయసులోనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ.. తన మంచి మనసును చాటుకుంది.ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె ఇటీవల నితిన్ హీరోగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్లో హవా చూపేందుకు సిద్ధమయ్యింది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా.. శ్రీ లీలా హీరోయిన్ గా సినిమా రాబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం . మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Mohanbabu: ఆ సినిమా కోసం నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టా.. కానీ – మోహన్ బాబు..!