BigTV English
Advertisement

Vaishnavi Chaitanya: ఎట్టకేలకు డ్రీమ్ ప్రాజెక్టు పై నోరు విప్పిన వైష్ణవి చైతన్య.. ఎప్పటికైనా ఆ పాత్ర చేయాలి

Vaishnavi Chaitanya: ఎట్టకేలకు డ్రీమ్ ప్రాజెక్టు పై నోరు విప్పిన వైష్ణవి చైతన్య.. ఎప్పటికైనా ఆ పాత్ర చేయాలి

Vaishnavi Chaitanya:..వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).. ఒకప్పుడు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు దక్కించుకొని ఆ తర్వాత వెబ్ సిరీస్ లు చేస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరైన ఈమె.. సాయి రాజేష్ (Sai Rajesh) దర్శకత్వం లో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా వచ్చిన ‘బేబీ’ సినిమాలో హీరోయిన్గా నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో ఒక ఇంటిమేట్ సీన్ లో కూడా ఎలాంటి భయం లేకుండా నటించి యువతను మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా నటించి అందరిని అబ్బురపరిచింది. ఇక ఈమె నటన చూసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఈమె పై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి తెలుగమ్మాయిలను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాము అంటూ కూడా తెలిపారు.


ప్రయత్నిస్తేనే కదా అవకాశం లభించేది – వైష్ణవి చైతన్య..

ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో ‘లవ్ మీ : ఇఫ్ యు డేర్’ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా ఈ సినిమాలో దెయ్యం పాత్ర పోషించడంతో ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ఇక ఇప్పుడు ఏకంగా సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సినిమాలో అవకాశాన్ని అందుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో వస్తున్న ‘జాక్’ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. వాస్తవానికి తెలుగమ్మాయి అంటేనే అటు నిర్మాతలు ఇటు దర్శకులు హీరోలు కూడా ఆమడ దూరం పారిపోయే పరిస్థితి ఉన్న ఈ కాలంలో కూడా అందరి దృష్టిని ఆకర్షించి, తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న తెలుగమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది వైష్ణవి చైతన్య. ఇకపోతే ఈమె నటించిన తాజా చిత్రం జాక్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు. అందులో భాగంగానే వైష్ణవి చైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన డ్రీం ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చింది.


అదే నా డ్రీమ్ రోల్ – వైష్ణవి చైతన్య

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే ప్రచారం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ ప్రచారం వల్లే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు. అసలు ప్రయత్నమే చేయకుండా అవకాశాలు రావడం లేదు అంటే.. అది ఎంతవరకు కరెక్ట్.. ఓపికతో ప్రయత్నిస్తేనే కదా అవకాశాలు వస్తాయో లేదో తెలిసేది. ఇందుకు చక్కటి ఉదాహరణ నేనే.. కొత్తగా వచ్చే వారికి నేను ఇచ్చే సలహా కూడా ఒకటే.. అవకాశాలు రావు అని భయపడే బదులు గట్టిగా ప్రయత్నిస్తే, అవే అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాయి అంటూ చెప్పుకొచ్చింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ. అలియా భట్(Alia Bhatt) నటించిన గంగూభాయి కతియావాడి’ సినిమా నాకు చాలా నచ్చింది.ఇందులో అలియా భట్ నటనకు ఫిదా అయిపోయాను. ఆమె ఆ పాత్రకు ప్రాణం పోసింది భవిష్యత్తులో నాకు కూడా ఇలాంటి పాత్రలు చేయాలని ఎంతో ఆశగా ఉంది. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యతఉన్న పాత్ర వస్తే ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నాను. అంటూ తన డ్రీమ్ ప్రాజెక్టు పై, డ్రీమ్ రోల్ పై కామెంట్లు చేసింది. ఒక ప్రస్తుతం ఈ విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×