E-Paper
Advertisement

Good Bad Ugly: కూతురు వయసున్న హీరోయిన్ తో అజిత్ రొమాన్స్..?

Good Bad Ugly: కూతురు వయసున్న హీరోయిన్ తో అజిత్ రొమాన్స్..?
Advertisement

Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడమూయుర్చి సినిమా సెట్స్ మీద ఉంది. ఇది కాకుండా అజిత్ నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

అధిక్ దర్శకత్వంలో వచ్చిన మార్క్ ఆంటోనీ హిట్ అందుకుంది.. మైత్రీ ఇప్పుడు ఫామ్ లో ఉన్న ప్రొడక్షన్ హౌస్.. అజిత్ లాంటి స్టార్ హీరో.. ఈ కాంబో కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపొత్ ఒక రెండు మూడు రోజులుగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. శ్రీలీల మొదట్లో ఉన్నంత జోరుమీద అయితే ఇప్పుడు లేదు. గుంటూరు కారం కూడా అమ్మడికి కలిసిరాలేదు. దీంతో ప్రస్తుతం ఆమె చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటుందని టాక్.

Advertisement

Also Read: ఫ్యామిలీ మ్యాన్ ప్రస్థానం విభిన్నం

ఇక ఈ నేపథ్యంలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో అజిత్ తో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పిందని సమాచారం. అయితే ఈ కాంబోపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. హీరో ఏజ్ ఎంత పెరిగినా.. సినిమాలో వారికి కుర్ర హీరోయిన్లు కావాలి అనే ఒక టాక్ ఉంటుంది. ఇప్పటివరకు అజిత్ ఆ లిస్ట్ లో చేరలేదు. అదొక రికార్డ్. ఇప్పటివరకు అజిత్ తన కన్నా చిన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన దాఖలాలు లేవు. ఇక ఇప్పుడు శ్రీలీల తో రొమాన్స్ అంటే ఫ్యాన్స్ కూడా ఒప్పుకొనేలా లేరు. మరీ చిన్నపిల్లలా ఉంటుందని, అజిత్ సెలక్షన్ ఇలా ఉంటుందని అనుకోలేదని, అజిత్ పక్కన శ్రీలీల కూతురిలా కనిపిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×