BigTV English

Manoj Bajpayee Birthday Special: ఛీత్కారాలు టూ ప్రశంసలు.. ఫ్యామిలీ మ్యాన్ ప్రస్థానం విభిన్నం!

Manoj Bajpayee Birthday Special: ఛీత్కారాలు టూ ప్రశంసలు.. ఫ్యామిలీ మ్యాన్ ప్రస్థానం విభిన్నం!

Manoj Bajpayee Birthday Special Story: మనోజ్ బాజ్ పాయ్.. తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. అవ్వడానికి బాలీవుడ్ నటుడే అయినా.. ఏ ఇండస్ట్రీలో అయినా ఇట్టే కలిసిపోతాడు. అందం మాత్రమే కావాలని అనుకొనే ఇండస్ట్రీకి.. తన టాలెంట్ తో హార్డ్ వర్క్ తో.. అందం అవసరం లేదు అని నిరూపించిన నటుల్లో మనోజ్ ఒకడు. బక్కపలచని శరీరం.. లోతైన కళ్లు.. చూడగానే అస్సలు ఇతను హీరోనా.. ? అనే అనుమానం వచ్చేస్తుంది. కానీ, నటన విషయంలో ఆయన కింగ్. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడమే.


విలన్, హీరో, సపోర్టింగ్ రోల్.. ఏదైనా సరే మనోజ్ బాజ్ పాయ్ దిగనంతవరకే. నటనమీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి.. ఎన్నో అవమానాలను, చీదరింపులను ఎదుర్కొని.. వాటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ నటుడుగా కొనసాగుతున్న మనోజ్ పుట్టినరోజు ఈరోజు. నేటితో ఆయన 55వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నట ప్రస్థానం గురించి కొన్ని మాటల్లో..

మనోజ్ బాజ్ పాయ్.. 1969 ఏప్రిల్ 23 న జన్మించాడు. చిన్నతనం నుంచి ఆయనకు నాటకాలు అంటే చాలా ఇష్టం. నేషనల్ స్కూల్ డ్రామాలో చేరాలని నాలుగుసార్లు ప్రయత్నించాడు. కానీ, అది జరగలేదు. దీంతో థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇక ఢిల్లీలో ఉండలేక.. ముంబైకి వచ్చి అవకాశాల వేట మొదలుపెట్టాడు. ఎన్నో అవమానాలు.. తిండి లేదు.. ఉండడానికి రూమ్ లేదు.. అయినా అవకాశాల వేట ఆపలేదు. అలా.. 1994 లో బందిత్ క్వీన్ అనే చిత్రంలో ఒక నిమిషం పాటు ఉండే పాత్రలో నటించాడు. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన మనోజ్ కు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమాతో బాగా పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆయన చేసిన భికూ మాత్రే పాత్రకు మొదటి జాతీయ అవార్డు అందుకున్నాడు.


Also Read: Naga Chaitanya 2nd Marriage: తెలుగు హీరోయిన్ తో నాగ చైతన్య రెండో పెళ్లి..?

సత్య తరువాత మనోజ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు.. విజయాలు.. అవార్డులతో స్టార్ గా మారాడు. తెలుగులో కూడా మనోజ్ మంచి సినిమాలే చేశాడు. సుమంత్ డెబ్యూ చిత్రం ప్రేమకథలో విలన్ గా నటించి మెప్పించాడు. హ్యాపీ, పులి, వేదం లాంటి సినిమాల్లో మనోజ్ నటనకు ఫిదా కానీ వారుండరు. ఇక ప్రయోగాలు చేయడంలో మనోజ్ సిద్ధహస్తుడు. ఓటిటీ వచ్చాక మనోజ్ మరింత ఫేమస్ అయ్యాడు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మనోజ్ పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంతతో ఆయన నటించడం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే.. కిల్లర్ సూప్, సైలెన్స్, సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై, జోరమ్.. ఈ సినిమాలు మనోజ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. మొదట ఛీత్కరించుకున్నవారే .. ఇప్పుడు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతూన్నారు. డాన్స్ రాదని, అందంగా లేడని అన్నవారే ఇప్పుడు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక మనోజ్ 14 ఏళ్లుగా ఒకపూట మాత్రమే భోజనం చేస్తున్నాడు. అందుకు కారణం ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు ఆకలి బాధలు ఎలాం ఉంటాయో తెలుసు అని, ఆ తరువాత వయస్సు పెరిగేకొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిసివచ్చిందని చెప్పుకొచ్చారు. తన తాత ఇలా ఒకపూట మాత్రమే తిని ఎంతోకాలం బ్రతికారని, అందుకే నేను కూడా 14 ఏళ్లుగా నైట్ డిన్నర్ చేయడం లేదని .. మొదట్లో కష్టంగా ఉన్నా కూడా తరువాత అలవాటు అయిపోయిందని తెలిపాడు. ఇక ప్రస్తుతం మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ముందు ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మనోజ్ బాజ్ పాయ్.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×