BigTV English

Sreeleela : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. లిప్ లాక్ తో..

Sreeleela : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. లిప్ లాక్ తో..

Sreeleela : శ్రీలీల ఈ పేరు వినగానే యూత్ మొత్తం కిస్సిక్ అంటున్నారు. పుష్ప 2 లో ఈమె చేసిన సాంగ్ అంతగా ట్రెండ్ అవుతుంది.. మొదటి సారి ఐటమ్ సాంగ్ చేసింది. కానీ పాపు్లారిటీ బాగా పెరిగింది. ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో తెగ రీల్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈమె ఈ సాంగ్ చేసిన తర్వాత బాగా బిజీ అయ్యింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తుంది. నిండా పాతికేళ్లు కూడా లేకుండానే ఈ ముద్దుగుమ్మ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యింది. సినిమాల సంగతి పక్కన పెడితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. మాట తప్పింది.. అంతా డబ్బుల కోసం చేస్తుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు మ్యాటరేంటో చూద్దాం..


టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పుష్ప 2 లోని కిస్సిక్ సాంగ్ ను అల్లు అర్జున్ తో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. ఆ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. దాంతో పాపకు నేషనల్ వైడ్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేస్తే ఫలితం తేడా కొడుతుందని శ్రీలీల త్వరగానే గ్హించారు. ఈ ఏడాది స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ వంటి సినిమాలు చేసినా ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్, తమిళ్‌లో అజిత్‌తో గుడ్ బాడ్ అగ్లీలో నటిస్తుంది. వీటితో పాటుగా రవితేజా మూవీలో కూడా నటిస్తుంది. ఇప్పటికే సంపాదించిన అనుభవంతో ఈ ముద్దుగుమ్మ సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది..

ఇదిలా ఉండగా..స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుని తీరా ఇక్కడ ప్లాపులు రాగానే ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తారన్న సంగతి తెలిసిందే. ఈ మాటను నిజం చేస్తూ శ్రీలీల కూడా తమిళ్‌పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్‌లోనూ ప్రస్తుతం ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. . ఫామ్లో దూసుకుపోతున్న హీరోయిన్ల పై రూమర్స్ రావడం కామన్. అలాగే ఈ అమ్మడు పై కూడా రూమర్స్ మొదలయ్యాయని తెలుస్తుంది.. శ్రీలీల ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ పలుమార్లు గాసిప్స్ వినిపించాయి. అలాంటి వాటి పై స్పందించిన ఈ అమ్మడు అదేం లేదని కొట్టి పారేసింది. అయినా కూడా రూమర్స్ ఆగలేదు.


ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ లిప్ లాక్ గురించి మాట్లాడింది. నేను ఏ హీరోతో లిప్ లాక్ సీన్‌లో నటించనని.. నా ఫస్ట్ కిస్ నా భర్తకే ఇస్తానని చెప్పింది.. కానీ గతంలో ఆమె చేసిన కన్నడ మూవీలో హీరోకు పెట్టేసింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కిస్ అనే కన్నడ చిత్రంలో నటించగా.. అది తెలుగులో ఐ లవ్ యూ ఇడియట్ పేరిట రిలీజైంది. ఇందులో ఓ సీన్‌లో హీరోకి ఘాటుగా లిప్ లాక్ ఇస్తుంది. తను గతంలో ఇలాంటి సీన్ చేశానన్న విషయం కూడా గుర్తు లేని పాప అబద్దం చెప్పడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీటి పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×