Squid Game 2 Review : 2021లో దక్షిణ కొరియా సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కలేదు. ఇది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన సిరీస్‌గా చరిత్రను సృష్టించింది. ప్రేక్షకులు ఇంతకు ముందు ఇలాంటివి గేమ్స్ చూడకపోవడంతో, క్రేజీగా ఫీల్ అయ్యారు. ఇక మూడేళ్ళ నుంచి సీజన్ 3 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజుతో ఆ నిరీక్షణ ముగిసింది. మరి తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మూడేళ్ళ నిరీక్షణకు వర్త్ అన్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
గత సీజన్‌లో 456 మంది ప్లేయర్‌ల మధ్య బ్లడీ బ్లడ్ గేమ్ ఎలా ఎండ్ అయ్యిందో చూశాం మనం. ప్లేయర్ నంబర్ 456 అయిన హీరో గేమ్ లో గెలిచాడు. దీంతో అతనికి జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బును ఇస్తారు. అయితే సీజన్ 2లో కూడా హీరో మరోసారి గేమ్ లో చేరతాడు. నిజానికి ఈ గేమ్ మాస్టర్ మైండ్ ఎవరిదో కనిపెట్టాలని అనుకుంటాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎంతోమంది నిస్సహాయులు, అప్పుల పాలైన వారు, బ్రతికితే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ లేదా చస్తే ఇక్కడే చావాలి అనుకునేవారు, అత్యాశపరులు గేమ్ లో పాల్గొంటారు. గత సీజన్ లో లాగే ఇందులో కూడా గెలిచిన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే, ఓడినవారు ఎలిమినేట్ అవుతారు. మరి ఈ సీజన్ లో విన్నర్ ఎవరు? గేమ్ ను పెడుతున్నది ఎవరో తెలుసుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టి హీరో వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? ఈ సీజన్ కి, గత సీజన్ కి ఉన్న తేడా? ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.
విశ్లేషణ
‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2లో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి గంట పాటు ఉన్నాయి. గత సీజన్‌లో 9 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అయితే ఆశ, అత్యాశ, జీవితం మీద విరక్తి… మనిషి చేత ఏమైనా చేయిస్తాయని ఈ సిరీస్ ద్వారా చెప్పాలనుకున్నారు. ఈ సీజన్ లో మొదటి 2 ఎపిసోడ్ లు విసుగు పుట్టిస్తాయి. పాత్రలను పరిచయం చేయడానికి ఇంత టైమ్ వేస్ట్ చేయాలా అన్పిస్తుంది. అసలు కథలోకి వెళ్ళడానికి మూడవ ఎపిసోడ్ దాకా వెయిటింగ్ తప్పదు. ప్లేయర్ నంబర్ 456 తప్ప, మిగిలిన అందరూ కొత్త ప్లేయర్‌లు. అక్కడ ఒక తల్లి – కొడుకు, ఒక జంట, గర్భవతి ఇలా కొత్త క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. కానీ సిరీస్ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆట పాతదే కానీ ట్విస్టులు కొత్తగా ఇచ్చే ప్రయత్నం చేశారు. సీజన్ 1లో ప్రేక్షకులకు బ్లడ్ గేమ్ బాగా నచ్చింది. కానీ సీజన్ 2లో ఊహించినంత రక్తపాతం లేదా గేమ్స్ లో కొత్తదనం లేదు. సీజన్ 1లో ప్రతిక్షణం సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఫీల్ ఉంటుంది. కానీ ఈసారి అలా లేదు. కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది. ఒక గేమ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో అందరూ అకస్మాత్తుగా ఒక గుంపుగా ఏర్పడి, ఒక గదిలోకి వెళ్లాలి. ఆపై ప్రతి ఒక్కరూ ఒకరికొకరు శత్రువులుగా మారతారు.
నటీనటులు
లీ జంగ్-జే, వై హా-జూన్, లీ బైంగ్-హున్, ఇమ్ సి-వాన్, కాంగ్ హా-నెయుల్, లీ జిన్-వూక్, పార్క్ సంగ్-హూన్, యాంగ్ డాంగ్-గెన్, జో యు-రి, కాంగ్ ఏ-షిమ్, లీ సియో-హ్వాన్… ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. కానీ భారతీయ ప్రేక్షకులకు ఇందులో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు.
చివరగా..
సీజన్ 1 చూసిన వారికి సీజన్ 2 అంత ఆసక్తికరంగా అనిపించదు. హైప్ ను అందుకోలేకపోయింది. కానీ ఈ సిరీస్ అభిమానులకు నచ్చే ఛాన్స్ ఉంది. సీజన్ 1 తో పోలిస్తే నిరాశ తప్పదు. ఇక సీజన్ 1ను చూడని వాళ్ళకు కూడా వర్త్ వాచింగ్ అన్పిస్తుంది.
రేటింగ్ : 2.75