E-Paper
Advertisement

Sri Sathya: అవును.. తప్పు చేశాను.. చెత్త వాగుడు వాగొద్దు

Sri Sathya: అవును.. తప్పు చేశాను.. చెత్త వాగుడు వాగొద్దు
Advertisement

Sri Sathya: సీరియల్స్ ద్వారా పరిచయమై బిగ్ బాస్ కు వెళ్లి ఫేమస్ అయిన నటి శ్రీసత్య. హౌస్ నుంచి బయటకు వచ్చాకా డ్యాన్స్ షోస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఢీ షోలో లేడీ కంటెస్టెంట్స్ కు లీడర్ గా వ్యవహరిస్తోంది. మొదట ఎన్నో ఇబ్బందులు పడిన ఈ చిన్నది ఇప్పుడిప్పుడే కెరీర్ ను సెట్ చేసుకుంటుంది.

ఇక టిల్లు స్క్వేర్ లో మంచి పాత్రలో కనిపించినా.. ఎడిటింగ్ లో అమ్మడిని లేపేయడంతో ఒక మంచి హిట్ సినిమాలో నటించాను అని చెప్పుకొనే అవకాశం కోల్పోయింది. అయినా అలాంటివేమీ పట్టించుకోకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనోగతాన్ని బయటపెట్టింది. తెలుగు అమ్మాయిలను అస్సలు పట్టించుకోవడం లేదని వాపోయింది.

Advertisement

” సినిమాల్లో నటించాలి అనేది నా డ్రీమ్. దానికోసం ఎంతో కష్టపడుతున్నాను. కానీ, అవకాశాలు రావడం లేదు. సీరియల్స్ లో నటిస్తున్నాను అని రిజెక్ట్ చేస్తుండడంతో.. వాటిని వదిలేశాను. అయినా ఛాన్స్ లు రావడం లేదు. తెలుగు అమ్మాయి అని కూడా కొంతమంది పక్కన పెట్టారు. ఇక డ్యాన్స్ షోస్ లలో ఒకరితో కలిసి డ్యాన్స్ చేస్తుంటే చెత్త కామెంట్స్ పెడుతున్నారు. చెత్త వాగుడు వాగొద్దు. అది వృత్తిపరంగా చేస్తుంది. పర్సనల్ వేరు, ప్రొఫెషనల్ వేరు.

టిల్లు స్క్వేర్ లో వచ్చే సాంగ్ నా సంగీత్ వేసుకలో వచ్చేది. నా సీన్స్ చాలా ఉన్నాయి. కానీ, థియేటర్ కు వెళ్లి చూస్తే.. ఒక్క షాట్ తప్ప అంత తొలగించారు. అది బాధగా ఉంది. ఇక నేను గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాను. అవును.. నేను తప్పు చేశాను. దాని గురించి తెలుసుకున్నాక మళ్లీ దాని జోలికి పోలేదు. నేను చెప్పాను అని బెట్టింగ్స్ చేసినవారు ఉన్నారు. వారికి నాకు తోచిన సాయం చేశాను” అని చెప్పుకొచ్చింది.

Advertisement

అంతేకాకుండా తాను లిప్ ఫిల్లర్ వేయించుకున్నట్లు కూడా ఆమె రివీల్ చేసింది. ” నన్ను ఎవరు చూసిన చిన్నపిల్లలా ఉన్నారని అంటున్నారని లిప్ ఫిల్లర్ వేయించాను. అది కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత లిప్స్ నార్మల్ స్థితికి వచ్చేస్తాయి. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ వింటున్నాను” అని తెలిపింది. ఇక శ్రీసత్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×