Virat Kohli Helping KL Rahul Get Ready: టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs India, 2nd ODI) మధ్య వెల్లింగ్టన్ ( Hnry Stadium, Wellington) వేదికగా రెండో వన్డే జరుగుతున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) తన క్రీడా స్ఫూర్తిని చాటు కున్నాడు. ఈ రెండో వన్డే ప్రారంభాని కంటే ముందు వికెట్ కీపర్ కే ఎల్ రాహుల్ ( KL Rahul) జెర్సీ వేసుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. వెల్లింగ్టన్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు జెర్సీలు ధరించిన రాహుల్.. తన స్లీవ్స్ సెట్ చేసుకోవడంలో ఇబ్బంది పడినట్టు కనిపించింది.
దీంతో వెంటనే విరాట్ కోహ్లీ అతడి వద్దకు వెళ్లి…కేఎల్ రాహుల్ స్లీవ్స్ సెట్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల పాటు అతని కోసం సమయం కేటాయించి… అందరి మనుషులను దోచేశాడు విరాట్ కోహ్లీ. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కోహ్లీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. పెద్ద లెజెండ్ క్రికెటర్ అయినా.. ఇలా తోటి ప్లేయర్లకు సహాయం చేస్తూ సింపుల్ గా ఉండడమే విరాట్ కోహ్లీ స్టైల్ అంటూ సోషల్ మీడియాలో అతని ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు. విరాట్ కోహ్లీ మ్యాచ్ లో ఉంటే ఆ కిక్కే వేరప్పా అంటూ కొందరు అంటుంటే, కేఎల్ రాహుల్ ను తన కొడుకు ‘అకాయ్’లా రెడీ చేస్తున్నాడంటూ మరికొందరు రియాక్టు అవుతున్నారు.
వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా (Team India) బౌలింగ్ అదరగొడుతుంది. మనోళ్ళ బౌలింగ్ దెబ్బకు న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 40 ఓవర్లు ఫినిష్ కాగా 9 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 132 పరుగులు సాధించింది. మహా అంటే మరో 25 – 30 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి మ్యాచ్ లోనైనా 185 పరుగులు సాధించిన న్యూజిలాండ్.. ఈ సారి 150 దాటడం కష్టమేనని అంచనా వేస్తున్నారు. డారిల్ మిచెల్ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. 17వ ఓవర్ లోనే డారిల్ మిచెల్ ను ఔట్ చేసే చాన్స్ వచ్చినా, గిల్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయాడు. లేకపోతే కివీస్ 100లోపే కుప్పకూలేది. కాగా, భారత గడ్డపై పెద్దగా ప్రభావం చూపని గుర్నూర్ బ్రార్ (gurnoor brar) న్యూజిలాండ్ లో మాత్రం ఇరగదీస్తున్నాడు. ఈ మ్యాచ్ లో 4 వికెట్లతో దుమ్ములేపాడు.
Look at the way Virat Kohli is helping KL Rahul get ready for the match by pulling his inner shirt sleeves out. 😂❤️
This reminds me of how my mom used to help me get ready for school when I was a kid. Kohli and Rahul's bond is truly unreal! pic.twitter.com/JzCsJnKQMI
— Sonu (@Cricket_live247) November 7, 2026