E-Paper
Advertisement

ఎఫ్‌డీఏ సంచలన నిర్ణయం.. బ్లింకిట్, జెప్టో సహా.. 105 సంస్థల ఫుడ్ లైసెన్సులు రద్దు!

ఎఫ్‌డీఏ సంచలన నిర్ణయం.. బ్లింకిట్, జెప్టో సహా.. 105 సంస్థల ఫుడ్ లైసెన్సులు రద్దు!
Advertisement

Food Safety Violations: మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (FDA).. క్విక్ కామర్స్ సంస్థకు బిగ్ షాక్ ఇచ్చింది. బ్లింకిట్, జెప్టో సహా ఏకంగా 105 ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. వీటితో పాటు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన మరొక ఏడు సంస్థలను వెంటనే తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.

తనిఖీల్లో రూ.1.35 కోట్ల సరుకు జప్తు!

నవంబర్ 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అధికారులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సుమారు 70కి పైగా సంస్థల నుంచి రూ.1.35 కోట్ల విలువైన 39.5 టన్నుల (39,485.42 కిలోలు) ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాటిలో పండుగ సమయంలో ఎక్కువగా అమ్ముడయ్యే కోవా, మావా, పనీర్, నెయ్యి, వంట నూనెలు, ఫర్సాన్, జీడిపప్పు-బాదం, వివిధ రకాల మిఠాయిలు ఉన్నాయి.

పూణె డివిజన్ లో అత్యధికంగా..

Advertisement

ఈ దాడుల్లో అత్యధికంగా పూణే డివిజన్ నుంచే రూ.49.36 లక్షల విలువైన 14.4 టన్నుల ఆహార పదార్థాలను అధికారులు జప్తు చేశారు. ఆ తర్వాత కొంకణ్ డివిజన్‌లో రూ.32.52 లక్షలు, నాసిక్ డివిజన్‌లో రూ.28.35 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.

ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని లైసెన్సుల రద్దు?

ఎఫ్‌డీఏ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. నాసిక్ డివిజన్ లో 39 సంస్థలు, ముంబైలలో 28 సంస్థలు (బ్లింకిట్, జెప్టోలతో కలిపి), పూణేలో 20 సంస్థలు, అమరావతిలో 15 సంస్థల లైసెన్స్ ను రద్దు చేశారు. అలాగే ఛత్రపతి శంభాజీనగర్ లో 2 సంస్థలు, థానేలో 1 సంస్థను జప్తు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాపార లావాదేవీలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలియజేశారు.

ఉల్లంఘనలు ఇవే..

Advertisement

తనిఖీల సందర్భంగా తయారీ కేంద్రాలు, గోదాముల్లో అత్యంత అపరిశుభ్ర వాతావరణం కనిపించిందని అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల నిల్వ, ప్యాకింగ్‌లలో నిర్లక్ష్యం, ఈగలు-కీటకాల నివారణ చర్యలు తీసుకోకపోవడం, సరైన ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలు, చట్టబద్ధమైన రికార్డులు, నాణ్యతా సర్టిఫికెట్లు లేకపోవడం వంటి అనేక లోపాలను అధికారులు గుర్తించారు.

Also Read: దీపావళి విందులో అతిగా తినకుండా జాగ్రత్త.. ఈ 7 టిప్స్ పాటిస్తూ పండుగ ఆస్వాదించండి

గుట్కా స్వాధీనం.. అరెస్టులు

ఆహార పదార్థాలతో పాటు నిషేధిత గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులపై కూడా అధికారులు ఉక్కుపాదం మోపారు. మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి రూ. 7.96 లక్షల విలువైన నిషేధిత ఉత్పత్తులను జప్తు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగిస్తున్న రూ. 4.70 లక్షల విలువైన రెండు వాహనాలను కూడా సీజ్ చేయడంతో పాటు రెండు దుకాణాలను అధికారులు సీల్ చేశారు.

Also Read: జియో కనివిని ఎరుగని ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 36 నెలలు తిరుగే లేదు.. అపరిమిత 5G, ఫ్రీ కాల్స్, ఓటీటీ సేవలు!

Tags

Related News

సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? జాగ్రత్త ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి

బంగారం కొనాలనుకుంటున్నారా? మేకింగ్ ఛార్జీలు లేకుండా కొనేందుకు 5 మార్గాలు

రాత్రి హైవేపై పంక్చర్‌తో ఆగిన లగ్జరీ కారు.. ఉదయం చూస్తే పూర్తిగా దగ్ధం.. బీమా నిరాకరించిన కంపెనీపై కేసు

ఉద్యోగం ఊడింది.. కానీ రూ. 9 లక్షల ఆఫర్ వచ్చింది! లేఆఫ్స్‌లో ట్రెండ్ సెట్ చేసిన కాన్వా

దలాల్ స్ట్రీట్‌లో దీపావళి పండగ.. ఫుల్‌జోష్‌లో మదుపరులు, పాత మార్క్‌ని టచ్ చేసిన సెన్సెక్స్-నిఫ్టీలు

పండుగ వేళ కొత్త మోసాలు.. కొంపముంచుతున్న ‘ఫ్రీ’ ఆఫర్లు.. NPCI కీలక హెచ్చరికలు!

దీపావళి గిఫ్ట్ అంటే ఇదీ.. ఏకంగా ‘ఐఫోన్ 16’లతో ఉద్యోగులకు సర్ ప్రైజ్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×