Sridevi – Boney Kapoor: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన అంద చందాలతో స్వర్గాన్ని మైమరిపించిన శ్రీదేవి(Sridevi )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సెలబ్రిటీలే కాదు వ్యాపారవేత్తలు కూడా శ్రీదేవిని కలవాలని, ఆమెతో కరచాలనం చేయాలి అని, మాట కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ఒక బడా వ్యాపారవేత్త అయితే గంటసేపు శ్రీదేవితో మాట్లాడడానికి ఏకంగా ఇంటినే రాసిచ్చారు అనే వార్తలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి. దీన్ని బట్టి చూస్తే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఆమెతో ప్రేమ, పెళ్లి గురించి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ స్పందించారు.
బోనీ కపూర్ తో ఆరు నెలలు మాట్లాడని శ్రీదేవి..
బోనీ కపూర్ మాట్లాడుతూ.. “శ్రీదేవిని నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నా చివరి శ్వాస ఆగిపోయే వరకు ఆమెను ఆరాధిస్తూనే ఉంటాను. శ్రీదేవి జ్ఞాపకాలతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను అంటూ బోనీకపూర్ తెలిపారు. ఇక ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. మా ప్రేమ, పెళ్లి విషయంలో ఆమెను ఒప్పించడానికి నాకు దాదాపు ఆరు సంవత్సరాల సమయం పట్టింది. మొదటిసారి నేను ఆమెకు ప్రపోజ్ చేసినప్పుడు ఆమె నన్ను బాగా తిట్టింది. దాంతో పాటు ఆరు నెలలు నాతో మాట్లాడలేదు కూడా.. అదే సమయంలో మీకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు నాతో ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటూ కూడా ప్రశ్నించింది. ఇక దాంతో నా మనసులో ఉన్న భావాన్ని ఆమెకు పూర్తిగా వివరించాను. ఆ తర్వాత నా పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె నా ప్రేమను అంగీకరించింది. అలా విధి మాకు అనుకూలించింది” అంటూ తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బోనీకపూర్.
ఎవరూ పర్ఫెక్ట్ కాదు..
బోనీ కపూర్ మాట్లాడుతూ.. “ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే నమ్మకం వల్లే వారి బంధం మరింత బలపడుతుంది. రోజురోజుకు అది పెరగాలే కాని తగ్గకూడదు. ఈ భూమ్మీద ఎవరూ పర్ఫెక్ట్ కాదు. నేను కూడా పర్ఫెక్ట్ పర్సన్ ను కాదు. శ్రీదేవితో ప్రేమలో పడడానికి ముందే నాకు పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే నేను మాత్రం ఈ విషయాన్ని ఆమె దగ్గర దాచలేదు. నా ప్రేమ గురించి నా మొదటి భార్య మోనా, పిల్లలకి కూడా చెప్పాను. ఇక వాళ్లు నా ప్రేమను అర్థం చేసుకున్నారు. విషయం ఏదైనా సరే మన భాగస్వామి పిల్లలతో ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలనేదే నా అభిప్రాయం అంటూ తన మాటగా చెప్పుకొచ్చారు బోనీకపూర్. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
శ్రీదేవి బోనీ కపూర్ పెళ్లి..
శ్రీదేవి కెరియర్లో చాలా బిజీగా ఉన్న సమయంలోనే బోనీ కపూర్ తో వివాహం జరిగింది. 1996లో వీరి వివాహం జరగగా.. వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2018 లో శ్రీదేవి అనుమానాధాస్పద స్థితిలో మృతి చెందగా. ప్రస్తుతం ఆమె పిల్లలు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు.