E-Paper
Advertisement

NTR New Movie : కన్ఫ్యూజన్‌లో తారక్ ఫ్యాన్స్… దేవర పరిస్థితేంటి ఇలా అయిపోయింది

NTR New Movie : కన్ఫ్యూజన్‌లో తారక్ ఫ్యాన్స్… దేవర పరిస్థితేంటి ఇలా అయిపోయింది
Advertisement

NTR New Movie : ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేవర కథ తెలుసుకున్నాం. కానీ, ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ముఖ్యంగా దేవరను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనే సమాధానం తెలియాలంటే… దేవర పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాలని సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పాడు. 300 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు అందరి కన్ను సీక్వెల్‌పైనే ఉంది. అయితే సీక్వెల్‌గా రాబోయే దేవర పార్ట్ 2 రావడం కష్టమనే వార్తలు వచ్చాయి. అలాగే వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే డ్రాగన్ తర్వాత దేవర పార్ట్ 2 ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే లెటెస్ట్ గా మరో వార్త వచ్చింది. అదేే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్‌లో పడేసింది. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…

వార్ 2 షూటింగ్ అప్డేట్…

Advertisement

దేవర తర్వాత వెంటనే వార్ 2 షూటింగ్ స్టార్ట్ చేశాడు తారక్. బ్రహ్మస్త్రం తర్వాత ఆయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే అమెరికాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ చేయగా… సోమవారంతో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టారు. దీని తర్వాత డబ్బింగ్ తో పాటు ప్రమోషన్స్ వర్క్స్ అన్నింటికీ తారక్ డేట్స్ ఇచ్చాడు.

నీల్‌తో డ్రాగన్…

Advertisement

వార్ 2 పనులు పూర్తి అయిన వెంటనే, ప్రశాంత్ నీల్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ స్టార్ట్ కానుంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ డ్రాగన్ స్క్రిప్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ కోసం వెయిట్ చేస్తున్నారట. డ్రాగన్ మూవీని వీలైనంత స్పీడ్‌గా కంప్లీట్ చేసిన 2026 సంక్రాంతికి వరకు రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

డ్రాగన్ తర్వాత…

డ్రాగన్ తర్వాత తారక్ చేయబోయే ప్రాజెక్ట్ దేవర పార్ట్ 2 అని అంతా అనుకున్నారు. కానీ, దేవర పార్ట్ 2కు మరింత టైం పట్టేలా ఉందని సమాచారం. తారక్ కోసం ఓ తమిళ డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీగా పెట్టుకుని ఎదురుచూస్తున్నారట. అతను ఎవరో కాదు… సూపర్ స్టార్ రజినీకాంత్ కు జైలర్‌తో మంచి హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్.

తారక్ కోసం నెల్సన్ ఇప్పటికే ఓ స్ట్రాంగ్ స్ట్రోరీని రెడీ చేశారట. ఈ ప్రాజెక్ట్‌ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించబోతున్నారని సమాచారం. ఇప్పటికే నెల్సన్‌కు జూనియర్ ఎన్టీఆర్‌కు నాగ వంశీ అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. 2026 స్టార్టింగ్‌లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

దేవర 2 ఇక వచ్చేది అప్పుడే…

2026 మొత్తం నెల్సన్ దీలిప్ కుమార్ కే డేట్స్ ఇవ్వబోతున్నాడట తారక్. ఆ సినిమాలో తారక్ మేజర్ వర్క్ పూర్తి అయిన తర్వాతే తారక్ వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడని సమాచారం. అంటే 2026 చివర్లో తారక్ కొత్త ప్రాజెక్ట్ ఉంటుందట. అన్ని కుదిరితే… ఆ 2026 చివరలో దేవర పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

అప్పటి వరకు కొరటాల పరిస్థితి ఏంటి..?

దేవర రిలీజై ఇప్పటికే రెండు నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు కొరటాల నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎంటి అనేది క్లారిటీ లేదు. దేవర మూవీకి 500 నుంచి 550 కోట్ల కలెక్షన్లు వచ్చినా… కొరటాలతో సినిమా చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం… కొరటాల శివ ఓ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. ఈ స్క్రిప్ట్ మలయాళ నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌‌ కోసం అని తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×