Big Stories

Sriranga Neethulu Trailer: సుహాస్.. మరో కొత్త కాన్సెప్ట్ తో హిట్ కొట్టేలా ఉన్నాడే..?

- Advertisement -

Sriranga Neethulu Trailer: కలర్ ఫోటో సినిమాతో సుహాస్ టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత హీరోగా, నటుడుగా, విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా సుహాస్ చేతిలో దాదాపు మూడు సినిమాలకన్నా ఎక్కువే ఉన్నాయి. ఇక అందులో శ్రీరంగ నీతులు ఒకటి.

- Advertisement -

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ప్రధానపాత్రల్లో ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించిన చిత్రం శ్రీరంగ నీతులు. ఈ చిత్రాన్ని రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముగ్గురు కథల  సమ్మేళనంగా ఈ సినిమా తెరకెక్కిన్నట్లు తెలుస్తోంది.

సుహాస్ కు పొలిటికల్ గా ఎదగాలని కోరిక. దానికోసం పోస్టర్ లు, ఫ్లెక్సీలు  కట్టి అతని ఏరియాలో బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇంకోపక్క విరాజ్, రుహని ప్రేమించుకుంటారు. కానీ రుహనికి తల్లిదండ్రులు వేరే సంబంధం తీసుకువస్తారు. అది ఆమెకు నచ్చదు. దానివలన ఈ లవర్స్ మధ్య గొడవలు మొదలైనట్లు చూపించారు. ఇక కార్తీక్ రత్నం కథలో అతనొక తాగుబోతు. అతను తాగుబోతులా ఎందుకు మారాడు.. ? ఈ ముగ్గురు జీవితాల కథలకు సంబంధం ఏంటి.. ? అనేది  సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి కథలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. కానీ, ఈ సినిమా కథ వేరుగా ఉంది. సుహాస్ .. ఎంచుకొనే కథలపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఏప్రిల్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా సుహాస్ మరో హిట్ అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News