Big Stories

Top 5 Millage Cars : రూ. 10 లక్షల్లో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే!

Top 5 Millage Cars
Top 5 Millage Cars

Top 5 Millage Cars : ఈరోజుల్లో కారు కొనడం చాలా సులభమై పోయింది. కొందరు అవసరాలకు కొంటుంటే.. మరికొందు స్టైల్ కోసం తీసుకుంటున్నారు. ఒకప్పుడు అయితే కారు కొనడం కాదు కదా.. ఆ ఆలోచన కూడా వచ్చే ఛాన్స్ లేకుండా ఉండేది. ఆ రోజుల్లో కారు అంటే ఒక స్టేటస్‌గా భావించేవారు. ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు మాత్రమే కార్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆ రోజులు పోయాయి.

- Advertisement -

తక్కువ ధరకే కార్లను కంపెనీలు తయారు చేస్తున్నాయి. కంపెనీలు కార్లు కొనేందుకు రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. తక్కువ డౌన్‌ పేమెంట్‌తో కారును కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇన్ని ఆఫర్లు ఉన్నా కూడా కార్లు కొనాలంటే కాస్త వెనుకాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మైలేజ్. మహా అంటే కారు 10 లేదా 15 ఇస్తుంది. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే కారు కొనడానికి వెనకాడరు. ఎందుకంటే ఇవన్నీ కూడా బెస్ట్ మైలేజ్ కార్స్. ఇక ఆలస్యం చేయకుండా వాటిపై ఓ లుక్కేయండి.

- Advertisement -

Also Read :  ఏథర్ నుంచి ఫ్యామీలీ స్కూటర్.. బుకింగ్స్ స్టార్ట్..!

టాటా అల్ట్రోజ్

టాటా కంపెనీ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాటా అంటే ఓ నమ్మకంగా భారతీయల మనసులో చెరగనిముద్రను వేసుకుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే కార్లు ఎక్కువగా మిడి రేంజ్‌లో ఉంటాయి. ఇక టాటా అల్ట్రోజ్‌లో 18 వేరియంట్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.8 లక్షలుగా ఉంది. ఈ కారు లీటర్‌కు 24 కిమీ మైలేజ్ ఇస్తుంది. సెల్లింగ్‌లో కూడా బెస్ట్‌గా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ సౌత్ ‌కొరియాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ. హ్యుందాయ్ ఫిబ్రవరిలో టాప్ సేల్స్‌ను నమోదు చేసింది. ఇక మైలేజ్ విషయానికి వస్తే హ్యుందాయ్ నుంచి హ్యుందాయ్ వెన్యూ బెస్ట్ కారుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 9లక్షలుగా ఉంది. ఈ కారులో లీటర్‌కు 23 కిమీ మైలేజ్ లభిస్తుంది.

మారుతి బాలెనో

మారుతి సుజికీ ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ. మారుతి సుజికీ కార్ల వాడకం సిటీల్లోనూ అటు పల్లెల్లోనూ అధికంగా ఉంటుంది. మారుతిలో డిజైర్ చాలా ఫేమస్ అయిన కారు. అందుకే సంస్థ ఈ కారును 2024కు అనుగుణంగా రీ మోడల్ చేస్తుంది. మారుతి కార్లలో ఈ కారు బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. లీటర్‌కు 23 కిమీ ప్రయాణించవచ్చు. ఇందులో ఆరు వేరియంట్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ. 8లక్షలుగా ఉంది.

మారుతి సుజుకి సియాజ్

ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ. 9లక్షలుగా ఉంది. కారు ఎనిమిది రంగుల్లో లభిస్తుంది. ఈ కారు లీటరుకు 21 కిమీ మైలేజ్ ఇస్తుంది.

Also Read : Xiaomi నుంచి స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 1200 కిమీ రేంజ్..?

మారుతి సుజుకి ఇటిక

ఈ కారు ఫ్యామిలీకి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. డ్రైవర్‌తో కలిపి ఏడు సీట్లు ఇందులో ఉంటాయి. కారు రెండు వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు. దీని ప్రారంభ ధర రూ. 8.68 లక్షలుగా ఉంది. ఈ కారు లీటరుకు 21 కిమీ మైలేజ్ ఇస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News