SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎవరు అంటే.. ఎవరైనా రాజమౌళి పేరునే చెప్పుకొస్తారు. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ .. లాంటి సినిమాలను తెరకెక్కించి ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడు జక్కన్న.
ఇక ఈ మధ్యనే రాజమౌళి జీవితం మొత్తం ఒక డాక్యుమెంటరీగా రిలీజ్ అయిన విషయం తెల్సిందే. మోడ్రన్ మాస్టర్స్ పేరుతో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు రాజమౌళికి సినిమాపై ఆసక్తి ఎలా వచ్చింది. తన హీరోలతో అతను ఎలా పని చేయించుకుంటాడు.. ? అసలు అతని మైండ్ లో ఉన్న కథను ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకొస్తాడు. దానికోసం ఎంతమందిని ఎలా కష్టపెట్టాడు అనేది చూపించారు.
ఇక ఇందులో అయన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు. ఇప్పటివరకు చాలామందికి తెలియని విషయం.. ఈ మోడ్రన్ మాస్టర్స్ వలన బయటపడింది. అదేంటంటే.. రాజమౌళి, రమా రాజమౌళిల ప్రేమ కథ. వీరిద్దరి అన్యోన్య దాంపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజమౌళి కన్నా ముందే రమాకు పెళ్లి అయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు. అతడే కార్తీకేయ.
ఇక రాజమౌళి ప్రపోజ్ చేసిన విధానం గురించి కూడా రమా.. ఈ డాక్యుమెంటరీలో వివరించింది. ” రాజమౌళి.. నా బావగారి తమ్ముడు. వారి పెళ్లిల్లోనే నేను ఆయనను చూసాను. మా ప్రపోజ్ కూడా అంత డ్రామాటిక్ గా ఏం జరగలేదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. నేను ఏం చెప్పలేదు. ఎందుకంటే.. అప్పటికే నాకు డైవర్స్ అయ్యాయి. ఒక బాబు ఉన్నాడు. అందుకే నేను బాగా ఆలోచించి వద్దు అన్నాను. ఆ తరువాత ఏడాది సమయం తీసుకున్నాం. ఆ తరువాత ఓకే చెప్పాను అని చెప్పుకొచ్చింది.
ఇక కార్తికేయ సైతం రాజమౌళి గురించి చెప్పుకొచ్చాడు. నాన్నగా కంటే ముందు ఆయన నాకు అంకుల్ గా పరిచయం. చిన్నతనం నుంచి నన్ను బాగా చూసుకున్నారు. కీరవాణి పెదనాన్న వాళ్ల పిల్లలతో నన్ను కూడా కలిపి ఆడించేవారు. అలా నేను కూడా ఆయనకు దగ్గర అయ్యాను. ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను. అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మోడ్రన్ మాస్టర్స్ చూసిన అభిమానులు ఈ విషయం తెలుసుకొని.. ఏంటి.. రాజమౌళి భార్యకు ముందే పెళ్లయ్యిందా.. అతను జక్కన్న సొంత కొడుకు కాదా.. ? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.