BigTV English

SSMB29 : మహేశ్ బాబు – రాజమౌళి మూవీ.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

SSMB29 : మహేశ్ బాబు – రాజమౌళి మూవీ.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

SSMB29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ తదుపరి సినిమా ‘SSMB-29’ గురించి ఓ వార్త అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.


దర్శక ధీరుడు రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. వీరి కాంబో ప్రకటించినప్పటి నుంచి ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా పనులను సైతం రాజమౌళి స్టార్ట్ చేసేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ బడ్జెట్‌కు సంబంధించి సినీ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చింది.

‘SSMB-29’ చిత్రానికి బడ్జెట్ ఎంత ఉంటుందో అని అంతా అనుకుంటున్న సమయంలో.. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.1500 కోట్ల బడ్జెట్‌ని కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఒక తెలుగు హీరో నటించే సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదని గుసగుసలాడుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం రాజమౌళి సినిమా అంటే ఈ మాత్రం ఉంటుందని అంటున్నారు. ఇందులో భాగంగానే రాజమౌళి ప్రస్తుతం లొకేషన్స్ కోసం పలు రకాల ప్రాంతాలకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది.


మరోపక్క ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో స్టార్ట్ కాబోతోందని సమాచారం. దీంతో ఈ షూటింగ్‌కి ముందు రాజమౌళి చిత్ర బృందంతో ఒక వర్క్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబుతో పాటు మొత్తం టీం అంతా ఇందులో హాజరు కాబోతున్నారట. దీని గురించి రాజమౌళి.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో మాట్లాడారు.

ఇక ఇందులో మహేష్ రోల్.. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసిగా వుండబోతోందట. దీనిని యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించబోతున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించబోతున్న ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతోంది. షూటింగ్ అంతా మూడుదేశాలలో జరుగుతుందని తెలియజేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వ్యవహారాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×