BigTV English

SSMB29: మహేశ్ తో ‘గ్లోబల్‌ అడ్వెంచర్‌’ మూవీ.. CAAతో డీల్.. రాజమౌళి క్లారిటీ

SSMB29: మహేశ్ తో ‘గ్లోబల్‌ అడ్వెంచర్‌’ మూవీ.. CAAతో డీల్.. రాజమౌళి క్లారిటీ

SSMB29: మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా. ఎప్పుడెప్పుడా అని అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ. త్వరలోనే అంటూ ప్రకటనలు. జేమ్స్ బాండ్ టైప్ మూవీ అంటూ ప్రచారం. అసలే రాజమౌళి. ఆపై మహేశ్ బాబు. వారిద్దరూ కలిస్తే. పాన్ ఇండియా రికార్డులు బ్రేక్ కావడం కాదు.. ఈసారి మనోళ్లు హాలీవుడ్ రికార్డులపై కన్నేశారని అంటున్నారు. లేటెస్ట్ గా, SSMB29 గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు జక్కన్న. అమెరికా పర్యటనలో ఉన్న ఆ దర్శక ధీరుడు.. మహేశ్ తో మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను హాలీవుడ్‌ మీడియాతో పంచుకున్నారు.


‘‘ఫారిన్ కంట్రీస్ లో ఆర్‌ఆర్‌ఆర్‌కు విజయం దక్కక ముందే మహేశ్‌బాబుతో నేను సినిమా చేస్తున్నట్టు ప్రకటించా. పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రాజెక్టు అది. గ్లోబల్‌ అడ్వెంచర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం కథ రాసే పనిలో ఉన్నాం. ఈ చిత్రం కోసం ‘సీసీఏ’తో ఒప్పందం చేసుకున్నా. దాని ద్వారా ప్రపంచ సినిమాను అర్థం చేసుకోగల ప్రతిభావంతులు పరిచయమయ్యారు. ఏం చేయాలి? సినిమా ఎలా తీయాలి? అనేదాన్ని ఫైనల్‌ చేసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది’’ అని రాజమౌళి అన్నారు.

మహేశ్ బాబుతో గ్లోబల్‌ అడ్వెంచర్‌గా సినిమా తీస్తానంటూ రాజమౌళి చెప్పడంతో SSMB29పై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి. అడ్వెంచర్ మూవీసే ఖతర్నాక్ ఉంటాయి.. అలాంటిది గ్లోబల్ అడ్వెంచర్ అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మహేశ్ ను అలాంటి సినిమాల్లో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అలా డ్రీమ్ రోల్ తో పాటు జక్కన్న డైరెక్షన్ రెండూ కుదరడంతో ఇక హాలీవుడ్ రికార్డులు బద్దలే..అంటున్నారు.


సీఏఏ అంటే ఏంటి?

క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ-CAA. ప్రపంచంలోని వేలాదిమంది దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, నటీనటులు, రచయితలు తదితర అన్ని విభాగాలకు చెందిన వారు సీఏఏలో ఉంటారు. నిపుణులైన వీరంతా అవసరం మేరకు ఆయా చిత్ర బృందాలతో కలిసి పనిచేస్తుంటారు. ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసే సీఏఏ నిపుణులు ఇప్పుడు పాన్ ఇండియా తెలుగు సినిమాకు పనిచేస్తుండడం ఆసక్తికరం. అసలే రాజమౌళి. ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పిండేసుకుని, వారి టాలెంట్ ను మాగ్జిమమ్ రాబట్టుకునే రకం. అలాంటి రాజమౌళి.. సీఏఏతో కలిసి పని చేస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి పెరిగాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×