Balayya: మ్యాడ్ 2 మూవీ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మ్యాడ్ పార్ట్ 1 ఊహించని హిట్ అవ్వడంతో, మ్యాడ్ 2 కూడా ఆడియన్స్ ని నవ్విస్తుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా మార్నింగ్ షో పడి, అన్ని సెంటర్స్ నుంచి మ్యాడ్ 2 సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకోవడమే లేట్.
మ్యాడ్ 2 ప్రమోషన్స్ లోనే మ్యాడ్ 3 ఉంటుందని చెప్పిన ప్రొడ్యూసర్ నాగ వంశీ… రీసెంట్ గా ఒక స్టార్ హీరోని ఈ వరల్డ్ లోకి తీసుకోని వస్తామని చెప్పాడు. నాగ వంశీ నుంచి ఈ మాట రాగానే సినీ అభిమానుల్లో ఆ స్టార్ హీరో ఎవరా అనే చర్చ మొదలయ్యింది. సోషల్ మీడియాలో మాత్రం… మ్యాడ్ 3లో బాలయ్య ఎంట్రీ ఇస్తాడేమో అనే కామెంట్స్ మొదలయ్యాయి. ‘మ్యాడ్’ ఫ్రాంచైజ్ ఇప్పటికే యూత్ ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఇప్పుడు బాలయ్య లాంటి మాస్ హీరో ఇందులో వస్తే, ఈ ఫ్రాంచైజ్ రేంజ్ పూర్తిగా మారిపోతుంది.
‘మ్యాడ్ 3’ – ఫాహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ స్టైల్‌లో?
‘మ్యాడ్ 3’ కూడా కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కుతుంది, ఇలాంటి వరల్డ్ లోకి బాలయ్య లాంటి మాస్ హీరో వస్తే అదో ఇంకో లెవల్ కి వెళ్తుంది. ప్రస్తుతం బాలయ్యకి యూత్ లో సూపర్ క్రేజ్ ఉంది, దాన్ని వాడుకుంటూ మ్యాడ్ 3 సినిమాని మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ఆవేశం’ స్టైల్‌లో రెడీ చేస్తే థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. ఆవేశం సినిమాని చూసినప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ ఫాహాద్ ఫాజిల్ నటించిన ఆ సినిమా చూసినప్పుడు, తెలుగు ఆడియన్స్ కూడా “ఈ క్యారెక్టర్‌కి బాలయ్య అయితే ఇంకా బాగా సెటవుతాడు” అంటూ కామెంట్స్ చేశారు.
‘ఆవేశం’ సినిమాలో ఫాహాద్ ఫాజిల్ సీరియస్ లుక్‌లో, వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్‌లో, ఫన్నీ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. ఇప్పుడు అదే క్యారెక్టర్‌ను బాలయ్య తన స్టైల్‌లో చేస్తే… థియేటర్స్‌లో ఊచకోతే! నార్త్, సౌత్ అని తేడా లేకుండా, ఆడియన్స్ ఈ తరహా క్యారెక్టర్‌లను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు…
వైట్ అండ్ వైట్‌లో బాలయ్య… కామెడీ + మాస్ మిక్స్!
బాలకృష్ణ స్టైల్ అంటే మాములుగా ఉండదు. ఆయన సినిమా చూస్తుంటే ఓవర్ ది టాప్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ మిక్స్ అవుతాయి. ఇప్పుడు ‘మ్యాడ్ 3’లో ఆయన్ని వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్‌లో, సీరియస్ లుక్‌లో, కాస్త ఫన్నీ మేనరిజమ్స్‌తో చూపించారంటే… ఆ రిజల్ట్ ఎలాగుంటుందో ఊహించొచ్చు!
‘మ్యాడ్ 3’ Biggest Hit అవ్వడం ఖాయమా?
‘మ్యాడ్’ సిరీస్ ఇప్పటివరకు యూత్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. కానీ, బాలయ్య లాంటి మాస్ హీరో జాయిన్ అయితే, ఫ్రాంచైజ్ రేంజ్ అమాంతం మారిపోతుంది. యూత్ మాత్రమే కాకుండా, మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్‌కు క్యూ కట్టేలా చేస్తుంది. బాలయ్య మార్క్ కామెడీ, యాక్షన్, మాస్ మెనరిజమ్స్ అన్నీ కలిసొచ్చినప్పుడు… బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడం ఖాయం! నాగ వంశీకి బాలయ్యకి చాలా మంది రాపో ఉంది కాబట్టి నాగ వంశీ అడిగి మ్యాడ్ 3 వరల్డ్ లోకి బాలయ్యని తీసుకోని వస్తాడేమో చూడాలి.