BigTV English

Star Heroine: కన్న తండ్రే అనుకుంటే కమలహాసన్ కూడా మోసం చేశాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Star Heroine: కన్న తండ్రే అనుకుంటే కమలహాసన్ కూడా మోసం చేశాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Star Heroine.. సాధారణంగా ఎంతోమంది వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఆ ఇబ్బందులను తట్టుకోలేక ఇండస్ట్రీలోకి వస్తే ఇక్కడ కూడా అవే ఇబ్బందులు ఎదురైతే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం వర్ణనాతీతం. ముఖ్యంగా ఎంతోమంది ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో తమకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకొని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ విధి వీరికి విరుద్ధంగా పనిచేయడమే కాదు వీరి జీవితాలను కూడా నాశనం చేస్తుంది. సరిగ్గా ఇలాంటి జీవితమే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుభవిస్తోందని సమాచారం. కడుపున పెట్టుకోవాల్సిన కన్న తండ్రి రోడ్డుకు వదిలేశాడు. కనీసం భర్త అయినా నూరేళ్లపాటు జీవితాంతం తోడు ఉంటాడు అంటే అది కూడా లేదు. అటు కన్నతండ్రి విడిపోయి, ఇటు కట్టుకున్న వాడు వదిలించుకొని ఒంటరిగా ఎన్నో అవస్థలు పడింది ఆ హీరోయిన్.


తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు..

ఆమె ఎవరో కాదు కమలహాసన్ (Kamal Hassan) మాజీ భార్య సారిక (Sarika) . ఇప్పటి తరానికి ఈమె గురించి తెలియదు కానీ అప్పటి తరానికి ఈమె ఒక డ్రీమ్ గర్ల్. ఐదేళ్ల వయసు నుంచే సినిమాలో నటించడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే ఇంట్లో గొడవలు జరగడంతో తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబానికి వెన్నెముకగా మారింది సారిక. అలా 1967లోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 1981వ దశకంలో ఇండస్ట్రీని ఏలింది. అదే టైంలో అప్పటికే ఇండస్ట్రీలో బిగ్ స్టార్ గా కొనసాగుతున్న కమలహాసన్ తో రిలేషన్ లో కొనసాగింది.


పెళ్లికి ముందే బిడ్డకు జన్మనిచ్చిన సారిక..

అదే సమయంలో పెళ్లయిపోయిన కమల్ హాసన్ ఈమెను వలలో వేసుకున్నారు అని అప్పట్లో నెటిజన్స్ కూడా కామెంట్లు చేసినట్లు సమాచారం. అయినా సరే ఇద్దరూ కొన్ని రోజులు డేటింగ్ లో ఉన్నారట. దీంతో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది సారిక. అలా వివాహానికి ముందే ప్రస్తుత పాన్ ఇండియా హీరోయిన్ శృతిహాసన్ కు జన్మనిచ్చింది. రెండేళ్ల తర్వాత కమల్ హాసన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సారికను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అక్షర హాసన్ జన్మించింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. 16 ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2004లో విడాకులు తీసుకున్నారు. భర్త ఒక్కసారిగా దూరం అవడంతో ఈమె పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.

కన్నతండ్రే కాదు.. కట్టుకున్నవాడు కూడా మోసం చేశాడు..

చిన్నప్పుడే కన్న తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లడంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భర్త కూడా వదిలేయడంతో ఎన్నో అవస్థలు పడిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. థియేటర్లో కూడా పని చేసిందని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం ఎప్పటి కప్పుడు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×