Podarillu Today Episode November 4th : కారు దిగిన తర్వాత మహాలక్ష్మి వెళ్లిపోతుంటే మహాలక్ష్మిని పిలుస్తాడు. అయితే మహాలక్ష్మి వచ్చి అయ్యో మీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను కదా అని ఇస్తుంది.అయితే పెళ్లి కాని అమ్మాయిలకి 50% ఆఫర్ అని పెట్టారు కదా.. అందుకే 150 రూపాయలు ఇచ్చాను అని అది చేతులు పెడుతుంది. మీరు ఇలాంటి ఆఫర్లు పెట్టారా ఆంటీలకి కూడా ఏవైనా ఆఫర్లు పెట్టారా అని మహాలక్ష్మి అంటుంది. అయితే మహాలక్ష్మి మాటలు వినయ్ అయ్యయ్యో ఈ అమ్మాయిలు నా పరువు తీసేసరే ఏదేదో ఊహించుకున్నాను ఏమీ లేదు అని బాధ పడిపోతూ ఉంటాడు చక్రి.
ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టిన తర్వాత చక్రీపై చాలా కోపంగా ఉంటుంది. అయితే మహాలక్ష్మి అంత కోపంగా ఉండడానికి చూసి కేశవ ఏమైంది రా నీ మీద అంత కోపంగా ఉంది ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక కేశవ జరిగిన విషయాన్ని చెప్పడంతో మొత్తానికి చక్రిని ప్రతి దానికి సగం సగం చేసి మిగిలిన విషయాన్ని అంతా అందరికి చెప్పేస్తుంది మహాలక్ష్మి. ప్రతి విషయం లను మహాలక్ష్మి అలా అనడంతో చక్రీ చాలా ఫీల్ అయిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు. చక్రి ఎప్పుడు చూసినా అమ్మాయిల వెంట చూస్తూనే ఉంటాడు అమ్మాయిలతో తిరుగుతూనే ఉంటాడు. అయితే అతన్ని ఎలాగైనా సరే మార్చాలి అని అందరూ ఒక మాట మీద ఉంటారు అంతేకాదు తనని ఒక ఆట ఆడుకుంటారు కూడా..
మహాలక్ష్మి ఉదయం లేవగానే అందరికీ టీ ఇస్తుంది అయితే చక్రికి మాత్రం అసలు టీ కాఫీ ఏమి ఇవ్వద్దు అని అంటుంది ఎందుకంటే మీతో గుడికి తీసుకొని వెళ్లి పూజలు చేయించాలి అని అంటుంది. నాకు పూజలు చేయించాల్సిన అవసరం ఏంటి? అని వద్దా ఇంట్లో ఎందుకు ఇలా చేస్తున్నారు నేను కనీసం కాఫీ కూడా తాగొద్దని చక్రి అడుగుతాడు.. నువ్వు కాఫీ కాదు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా గుడికి వెళ్లి పూజ చేయాలి. నువ్వు చేసిన పాపానికి ప్రక్షాళన గావించాలి అంటూ మహాలక్ష్మి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడంతో చక్రి చాలా షాక్ కింగా ఆలోచిస్తూ ఉంటాడు.. అసలు మాధవ్ కూడా వచ్చి వీడిని వెళ్లి రెడీ చేయండి అని అంటారు.. ఇక చక్రిని బలికిచ్చినట్లు రెడీ చేయడంతో చక్రి ఏంట్రా నన్ను ఏమైనా తీసుకుని వెళ్లి బలిస్తున్నారా ఏంటి ఇలా రెడీ చేశారు అని ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు.
ఇకపోతే గుడికి వెళ్లగానే అక్కడున్న పూజారి ప్రవర్తన చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ పూజ ఏంటి ఇంత వింతగా విచిత్రంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అమ్మాయిలని చూస్తున్నాడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు అని చెప్పగానే పూజారి దొంగ కళ్ళు పట్టుకునే వాడిలాగే ఉన్నాడు. వీడు చేత ప్రక్షాళన పూజ చేయిస్తాను పాపాన్ని కడిగేస్తాను అంటూ చేతిలో హారతి ఇవ్వాలి అని చెప్పగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పూజారి మాత్రం అస్సలు వదలకుండానే చేతిలో హారతి ఇవ్వడానికి కర్పూరం పెట్టి వెలిగిస్తాడు. మొత్తానికి చక్రీకి చుక్కలు కనిపిస్తాయి.. ఇక తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలని అనగానే అందరూ కూడా చక్రీని వెళ్ళమని చెప్తారు..
చక్రి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమని పంపిస్తే తను మాత్రం వెళ్లి అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఉంటాడు అది చూసిన కన్నా.. అందరినీ అక్కడికి పిలుచుకొని వస్తారు. అయితే చక్రిని చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవడంతో పాటుగా తనపై సీరియస్ గా ఉంటారు.. ఇకపోతే పూజ అవ్వగానే ఇంటికి రాగానే చక్రి నన్ను అసలు పట్టించుకోవడమే లేదు పొద్దున్నుంచి ఈ పూజ అయ్యేంతవరకు ఏమీ తినదన్నారు కానీ ఇప్పటికి నాకు ఏది పెట్టట్లేదు అని బాధపడిపోతూ ఉంటాడు. చక్రి మాటలు విన్న వాళ్లు నువ్వే చేసుకుని తిను అని అంటారు. అయితే మాధవ్ మనిషా కోసం వెళ్లాలి అని చెప్పగానే మాధవ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో మాధవ్ ని తన తమ్ముళ్లు చాలా స్టైలిష్ గా తయారు చేస్తారు.. అటు మనిషా కూడా అలానే రెడీ అవ్వడంతో అందరూ కూడా షాక్ అవుతారు.. ఇక వచ్చే ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతాయో చూడాలి..