AP Election Result-2026: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచాయి. వారి పాలనపై స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి రెఫరెండం లాంటింది. ఎన్నికలను ఎదుర్కోవడంలో టీడీపీ సమర్దతకు ఇదొక గీటురాయి అని చెప్పవచ్చు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఇదొక మైలురాయి కూడా. వైసీపీ తీరుపై పట్టణ, నగరాల ఓటర్ల ప్రజాభిప్రాయం బయటపడింది. చాలామంది ఓటర్లు దూరంగా ఉన్నారు కూడా. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని మరోసారి నిరూపణ అయ్యింది. !
ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నిక ఫలితాలు కూటమి గెలుపు, వైసీపీ ఓటమి రెండూ సంపూర్ణమే! ఎందుకంటే 2029 ఎన్నికలకు ముందు అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీ చేజేతులా జార విడుచుకుంది. కూటమిలోని మూడు పార్టీలు సీట్ల షేరింగ్ విషయంపై పెద్ద రచ్చ సాగింది. దీంతో ప్రజల చూపు అంతా ఆ మూడు పార్టీల వైపు ఉండేలా చేయడంలో కూటమి సక్సెస్ అయ్యింది. వైసీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేసినా, సరైన ప్లానింగ్ లేకపోవడం, అభ్యర్థులకు ఆర్థిక భరోసా ఇవ్వకపోవడం వంటి కారణాలతో కేడర్ వెనక్కి తగ్గింది.
ఫలితంగా ఓటమి తెచ్చుకుంది. కూటమి కో-ఆర్డినేషన్, సమిష్టి కృషికి ఈ ఫలితాలకు నిదర్శనం. దీని వెనుక టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఇక టీడీపీ విషయానికి వద్దాం. సీట్లు షేరింగ్ మొదలు, అభ్యర్థుల ఎంపిక వరకు తనదైన ముద్ర వేశారు. నాలుగు రకాలుగా అభ్యర్థులను వడపోసి ఎంపిక చేశారు. రాజకీయ నేతల బంధు గణానికి కాకుండా, పార్టీని నమ్ముకున్న వారికి ప్రయార్టీ ఇచ్చారు. దీనివల్ల పార్టీని నమ్ముకుంటే అవకాశాలు వస్తాయనే సంకేతాలు కేడర్‌కు పంపించారు.
ALSO READ: స్థానిక ఫలితాలపై జగన్ రియాక్ట్.. జరిగినవి ఎన్నికలు కావు, ఎంపికలు మాత్రమే
సీట్ల షేరింగ్ విషయంలో ఆయా జిల్లాల నేతలు, ఇన్‌ఛార్జ్ మంత్రులతో నిత్యం మంతనాలు చేస్తూ వచ్చారు. రెబెల్స్‌ని డ్రాపయ్యేలా చేశారు. నామినేషన్ నుంచి పోలింగ్ వరకు అన్నీ తానై నడిపించారు నారా లోకేష్! ఫలితంగా మంచి ఫలితాలు వచ్చాయి. అంతేకాదు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా మారిన పులివెందులలో పసుపు జెండా రెపరెపలాడింది. ఈ విజయం వెనుక యువనేత కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. మరో ఏడాదిలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జోరు కొనసాగిస్తే, 2029 ఎన్నికల్లో కూటమి జెండా మరోసారి రెపరెపలాడడం ఖాయం.