Karthika Deepam 2 serial today Episode: వంటల విషయంలో తప్పు చేసిన వ్యక్తి ఎవరనేది కార్తీక్ తెలుసుకుంటాడు. అందుకు కారణమైన మేనేజర్ ను అందరి ముందు పిలిచి నిజం చెప్పమని గద్దిస్తాడు. మేనేజర్ మొదట తనకేం తెలియదని బుకాయిస్తుంటే.. కార్తీక్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దీంతో మేనేజర్ తప్పు చేశానని.. చెప్పగానే.. నువ్వు తప్పు చేశావని తెలుసు కానీ నీ వెనకాల ఉండి తప్పు చేయించింది ఎవరో అది తెలియాలి కదా అంటాడు కార్తీక్. అప్పటికే భయంతో వణికిపోతున్న మాలిని ఎక్కడ మేనేజర్ తన పేరు చెప్తాడోనని కోపంగా మేనేజర్‌ను కొట్టి అక్కడి నుంచి వెళ్లగొడుతుంది.
మేనేజర్ వెళ్లిపోయాక మాలిని ఆలోచిస్తూ బయటకు వెళితే కార్తీక్, దీప వెనకాలే వెళ్తారు. తోడేలు తను చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి కుందేలును బలి చేసింది అంటారు. ఈ ఆట ఎంతో సేపు సాగదు అంటారు. అందుకు మాలిని కోపంగా ఇంత దూరం వచ్చారు కాబట్టి చెప్తున్నాను. నేను చేయాలనుకున్న తప్పులకు అసలు సాక్ష్యాలే ఉండవు.. నేను ఆడే ఆటకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే మీరందరూ బలైపోతారు. నేను రంగంలోకి దిగితే డైనోసార్ వేటకి దిగినట్లే ఉంటుందిరా..! అది మీరు తట్టుకోలేరు అంటూ వార్నింగ్ ఇస్తే.. దీప కూల్‌గా ఆల్ ది బెస్ట్ అత్త అంటుంది. మాలిని కోపంగా మీరు నన్ను తట్టుకోలేరు నా నుండి తప్పుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
జ్యోత్స్న కోపంగా సూరజ్‌తో తప్పు ఎవరో చేస్తే నువ్వు మీ అమ్మ మాత్రం ఆ తప్పుకు దీపను బలి చేయాలనుకున్నారు అంటూ తిడుతుంటే.. సూరజ్ మాత్రం అలాగే ఎందుకు అనుకోవాలి. దీప, కార్తీక్ లే ఆ మేనేజర్‌తో చేతులు కలిపి కావాలనే ఈ నాటకం ఆడారని అనుకోవచ్చు కదా అంటాడు. వాళ్ల నిర్లక్ష్యమే ఈ తప్పుకు కారణం అయ్యుండొచ్చు కదా అంటాడు అప్పుడే లోపలికి వస్తున్న మాలిని కరెక్ట్‌గా చెప్పావురా అంటుంది. మాలిని వెనకాలే వచ్చిన కార్తీక్, దీపలు కూడా వింటారు. కార్తీక్ అవును తప్పంతా దీపదే..? ఎందుకంటే ప్రతి అడ్డమైన వాడిని నమ్మినందుకు అంటూ తిడతాడు.. మాలిని, సూరజ్ షాక్ అవుతారు.
ఒకే ఇంట్లో ట్యూషన్ మాస్టర్‌గా వంట మనిషిగా పని చేస్తున్న దశరథ, సుమిత్రలు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ఆ ఇంట్లో వాళ్ల ముందు మౌనంగా ఉండి తర్వాత ఇద్దరూ ఎందుకు పని చేస్తున్నారని ప్రశ్నించుకుంటారు. ఎందుకు నేను కష్టపడుతున్నాను కదా నువ్వెందుకు వంట మనిషిగా చేస్తున్నావు అని దశరథ అడిగితే.. రెండు గంటల పని మంచి జీతం కదా నేను సంపాదించే డబ్బు దాచిపెడితే జ్యోత్స్న పెళ్లికి ఏదో రకంగా ఉపయోగపడతాయని సుమిత్ర చెప్తుంది. అయినా భార్యాభర్తలు అంటే చెరిసగం అంటారు. మనం తలా ఒక పని చేసుకోవడం తప్పు కాదులేండి అంటుంది. సుమిత్ర మాటలకు దశరథ నా భార్య ఇవాళ కొత్తగా కనిపిస్తుంది అంటే సరే కానీ ఈ విషయాలేవీ మామయ్య గారికి చెప్పోద్దు ఏ కష్టమైనా నష్టమైనా మనిద్దరమే పంచుకుందాం అంటుంది సుమిత్ర.
మరోవైపు ఆఫీసులో కార్తీర్, దీప, జ్యోత్స్న లంచ్ చేయడానికి కూర్చుంటారు. జ్యోత్స్న చేతులు కడుక్కోవడానికి వెళితే సూరజ్ వచ్చి తనదే అనుకుని జ్యోత్స్న బాక్స్ తీసుకుని తింటుంటాడు. దీప చూసినా కార్తీక్ ఏమీ అనొద్దని సైగ చేస్తాడు. ఇద్దరూ మౌనంగా తింటుంటారు. అప్పుడే వచ్చిన జ్యోత్స్న చూసి నవ్వుకుని సూరజ్ బాక్స్ తీసుకుని తను తింటుంది. మాలిని వచ్చి చూసి సూరజ్‌ను తిడుతుంది. వాళ్లతో కలిసి వాళ్ల బాక్స్ తినడం ఏంటని ప్రశ్నిస్తుంది. అందుకు సూరజ్ కన్పీజ్ అయ్యానని ఎంత చెప్పినా మాలిని వినదు. మాలిని వెళ్లిపోయాక మీరు తెలిసి కూడా నన్ను మా అమ్మ దగ్గర ఇరికించారు కదా అంటూ కార్తీక్, దీపలను అడుగుతాడు. వాళ్లు పలకరు.. ఇంతలో జ్యోత్స్న అయితే రేపు కూడా బాక్స్ తీసుకుని రండి మార్చుకుని తిందాం చెల్లుకు చెల్లు అంటుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.