BigTV English

Guntur Kaaram Movie : గుంటూరు కారం స్క్రీన్ పై మురారి జోడి .. ఇదేమి కాంబినేషన్ గురూజీ..

Guntur Kaaram Movie : గుంటూరు కారం స్క్రీన్ పై మురారి జోడి .. ఇదేమి కాంబినేషన్ గురూజీ..

Guntur Kaaram Movie : ప్రస్తుతం  సంక్రాంతి బరిలోకి వచ్చే సినిమాల గురించి డిస్కషన్ మెల్లగా షురూ అయింది. అరడజనుకు పైగా సినిమాలు రంగంలో ఉన్న సంక్రాంతి రేసులో.. ఎక్కువమంది ఎదురుచూస్తున్న చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈనెల 27 కి మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోతుందట. త్వరలోనే మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరు అందుకుంటాయి.ఈ నేపథ్యంలో గుంటూరు కారం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.


గురూజీ డైలాగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. వ్యంగ్యాన్ని కూడా అందంగా ముస్తాబు చేసి.. షడ్రుచులతో భోజనం వడ్డించినట్టు సెటైర్లు వడ్డించడం గురూజీకే చెల్లుతుంది. అందుకే అతన్ని మాటల మాంత్రికుడు అంటారు. ఇక తన ప్రతి సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ దింపడం గురూజీకి ఓ ఆనవాయితీగా మారింది. అత్తారింటికి దారేది మూవీలో నదియా.. సన్నాఫ్ సత్యమూర్తి లో స్నేహ.. అజ్ఞాతవాసిలో ఖుష్బూ.. అరవింద సమేత లో దేవ‌యాని.. అలవైకుంఠపురంలో టబు.. ఇలా ప్రతి సినిమాలో ఒక స్ట్రాంగ్ పాత్రకు అంతకంటే స్ట్రాంగ్ సీనియర్ నటిని దింపుతారు గురూజీ.

కథకు తగిన కంటెంట్.. అంతకంటే ఇంటెన్సిటీ తో ఉన్న వాళ్ళ పాత్రలు.. వాటి చుట్టూ అందంగా సాగే కథనం. ఇలా సినిమాలోని ప్రతి పాత్రకు తగిన ప్రాముఖ్యత ఇస్తూ స్టోరీని ఎంతో నైపుణ్యంగా ముందుకు తీసుకువెళ్లడం త్రివిక్రమ్ స్టైల్. మరి గుంటూరు కారం విషయంలో కూడా గురూజీ ఇదే సెంటిమెంట్ ని రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో ఇప్పటికే రమ్యకృష్ణ పాత్ర కన్ఫామ్.. అయితే ఇప్పుడు మరొక సీనియర్ నటి ఈ చిత్రంలో కాసేపు తళుక్కున మెరుస్తుందట.


ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఒకప్పుడు మురారి చిత్రంలో మహేష్ బాబు పక్కన నటించిన సోనాలి బింద్రే. గుంటూరు కారం చిత్రంలో సోనాలి బింద్రే ఓ గెస్ట్ పాత్ర చేయబోతున్నట్లు టాక్. సుమారు 20 నిమిషాల పాటు స్క్రీన్పై కనిపించే సోనాలి చాలా వరకు మహేష్ తో ఉండే సీన్స్ లో నటిస్తోందట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇదే కన్ఫర్మ్ అయితే మాత్రం ఒకప్పటి మురారి హిట్ జంట మళ్లీ తిరిగి స్క్రీన్ పై చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది. ఇంతవరకు అంతా బాగుంది కానీ సోనాలి బింద్రే ఇందులో ఏ పాత్ర పోషిస్తుంది అనేది ప్రస్తుతం పెద్ద భేతాళ ప్రశ్న గా మారింది. మురారి లో బావ.. మరదల్ని.. గుంటూరు కారం లో గురూజీ ఎలా చూపిస్తాడో చూడాలి మరి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×