BigTV English

Kishan Reddy : లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్ కు అమిత్ షా రాక..

Kishan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌లో సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించ లేక పోయిందన్నారు. అయితే 8 అసెంబ్లీ స్థానాలతో అద్భుతమైన విజయాలను బీజేపీ సొంతం చేసుకుందన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లతో 14శాతం ఓట్లను సాధించడం సానుకూలమైన పరిణామమే అన్నట్లుగా వెళ్లడించారు. రాబోయే ఎన్నికల్లో మోడీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఎదురుచూస్తోందన్నారు.

Kishan Reddy :  లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. హైదరాబాద్ కు అమిత్ షా రాక..

Kishan Reddy : లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించలేక పోయామన్నారు. అయితే 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచినా.. దాదాపు 30 లక్షల ఓట్లతో 14 శాతం ఓట్లను సాధించడం సానుకూలమైన పరిణామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని మూడోసారి గెలిపించేందుకు దేశ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తోందన్నారు.


లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ ను మరింత పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు సాధించినా.. కానీ ఆ వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సారికూడా అదే మాదిరిగా సాధ్యమైనని ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు సూచిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ప్రకటించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మద్దతు తెలిపింది. అయినా సరే కాషాయ పార్టీకి ఓట్లు, సీట్లు రాకపోవడంతో లోతైన విశ్లేషణ జరగాల్సి ఉందనే బీజేపీ అధిష్టానం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో పార్టీ శ్రేణులను సంసిద్ధం చేసేందుకు డిసెంబర్ 28న రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ సమీపంలో విస్త్రృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలోని పార్టీ, మండలశాఖ అధ్యక్షులు మొదలు రాష్ట్రస్థాయి నేతల వరకు హాజరవుతారని చెప్పారు. రానున్న ఎన్నికలకు 90 రోజుల కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.


కొంగర కలాన్ లో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్ష చేస్తారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఎలా సన్నద్దం కావాలి? ఏయే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి? ఎలాంటి వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలనే దానిపై రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 28న మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు వెళ్తారు. నోవాటెల్ లో మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.45 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అనంతరం 1.50గంటలకు కొంగరకలాన్ లో జరిగే ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సమయాత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×