BigTV English

Star Producer on Actress Meena: ప్రోగ్రామ్ కోసం వెళ్తే మీనా నాతో చీప్ గా మాట్లాడింది.. స్టార్ ప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ ఆవేదన!

Star Producer on Actress Meena: ప్రోగ్రామ్ కోసం వెళ్తే మీనా నాతో చీప్ గా మాట్లాడింది.. స్టార్ ప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ ఆవేదన!

Producer Manickam about Actress Meena : ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. స్టార్స్ గా ఎదిగినా కూడా కష్టపడి పైకి వచ్చిన విధానాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇండస్ట్రీలో ఏ స్టార్ ను అడిగినా ఇదే మాట చెప్తారు. అయితే కొన్ని సార్లు.. కొంతమంది ముందు అదే స్టార్స్ కొంచెం దురుసుగా మాట్లాడుతూ తమ సక్సెస్ ను చూపించాలనుకుంటారు. సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా కూడా గతంలో ఒక ప్రొడ్యూసర్ తో దురుసుగా మాట్లాడిందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ సుదూర నిర్మాతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.


బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ్ అని తేడా లేకుండా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక అలాంటి సమయంలోనే తమిళ్ నిర్మాత మాణిక్యం నారాయణన్.. ఒక ప్రోగ్రామ్ చేయమని అడగడానికి మీనా ఇంటికి వెళ్ళాడట. అక్కడ ఆయనను మీనాతో పాటు ఆమె తల్లి కూడా అవమానించారని ఆయన తెలిపాడు.

“మీనా అప్పుడు స్టార్ స్టేటస్ లో ఉంది. ఆమెతో ఒక ప్రోగ్రామ్ చేయిద్దామని.. ఆమెను అడగడానికి ఇంటికి వెళ్లాను. అటునుంచి మంచి స్పందన రాలేదు. మీనా చాలా దురుసుగా మాట్లాడింది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా దురుసుగా మాట్లాడింది. నేను ఒక నిర్మాతను.. నాలాంటివాళ్లే వారికి సినిమాలు ఇచ్చేది. అలాంటిది.. నాతో వారు చీప్ గా మాట్లాడతారా.. ? చాలా బాధగా అనిపించింది. ఆ టైమ్ లోనే అనుకున్నాను.


Also Read: NKR 21: తాత జయంతి రోజు కొత్త సినిమా ప్రకటించిన నందమూరి హీరో..

ఇక ఈ సంఘటన తరువాత ఇంకెవరిని ఏది అడగకూడదని.. ఇండస్ట్రీలో నాకు చాలామంది హీరోయిన్స్ ఇప్పటికీ స్నేహంగా మెలుగుతారు. సుహాసిని,రోజా, ఖుష్బూ.. ఇలా వీరందరూ మంచిగా మాట్లాడతారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నిర్మాత మాటలు విన్న అభిమానులు.. ఏంటి మీనా మరి ఇలా మాట్లాడుతుందా.. ? ఆమె చాలా మంచిది అనుకున్నామే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మీనా ఒక పక్క సినిమాలు, షోస్ తో బిజీగా మారింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×