BigTV English

Chennai Airport E-Mails Threat: వారంలో చెన్నై ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం.. ఈ మెయిల్స్ బెదిరింపులు!

Chennai Airport E-Mails Threat: వారంలో చెన్నై ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం.. ఈ మెయిల్స్ బెదిరింపులు!

Chennai Airport E-Mails Threat: దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ మధ్యకాలంలో బెదిరింపులు తీవ్రమయ్యాయి. ఈ జాబితాలోకి చెన్నై కూడా చేరిపోయింది. వారం రోజుల్లో చెన్నై ఎయిర్‌పోర్టును పేల్చేస్తామంటూ ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు.


పోలీసులు, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. అంతేకాదు ప్రతీ ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ఓ కన్నేశారు. సీసీ కెమెరాల ద్వారా పదేపదే ఎయిర్‌పోర్టు వచ్చేవాళ్లపై నిఘా పెట్టారు. నకిలీ వెబ్‌సైట్ల నుంచి ఈ- మెయిల్ పంపించినట్టు సమాచారం. దీని వెనుక డ్రగ్స్ ముఠా ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు.

రెండు రోజులుగా విమానాశ్రయం మొత్తాన్ని గాలిస్తున్నారు పోలీసులు. ఇటీవలకాలంలో చెన్నై ఎయిర్‌పోర్టు లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతోంది. విదేశాల నుంచి భారీగా రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు . ఈ బెదిరింపుల వెనుక డ్రగ్స్ ముఠాల ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు. అయినా అధికారులు వాళ్ల పనిలో వాళ్లు నిమగ్నమయ్యారు.


Also Read: తీరందాటిన రెమాల్.. వణికిపోయిన బెంగాల్, బంగ్లా

ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కూడా ఇలాంటి హడావుడి మొదలైంది. సరిగ్గా వారం కిందట ఢిల్లీ నార్త్ బ్లాక్‌‌లో ఉన్న హోంమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అధికారులు డాగ్ స్వ్కాడ్, డిస్పోజల్ స్వ్కాడ్‌ను రంగంలోకి దింపి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు ఢిల్లీలోని ముఖ్యమైన స్కూల్స్, ఆసుపత్రులకు ఆ తరహా బెదిరింపులు వచ్చాయి. ఎవరు, ఎక్కడ నుంచి పంపిస్తున్నారనేది మాత్రం తెలియరాలేదు.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×