BigTV English
Advertisement

#NKR 21: తాత జయంతి రోజు కొత్త సినిమా ప్రకటించిన నందమూరి హీరో..!

#NKR 21: తాత జయంతి రోజు కొత్త సినిమా ప్రకటించిన నందమూరి హీరో..!

Nandamuri Kalyan Ram’s #NKR21’s Fist of Flame Glimpse Out Now: బింబిసార చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని బౌన్స్ బ్యాక్ అయ్యాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఆ సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమా తరువాత వచ్చిన డెవిల్ ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా అలాంటి హిట్ అందుకోవడానికి కళ్యాణ్ రామ్ కసిగా ప్రయత్నిస్తున్నాడు.


ఇందులో భాగంగానే నేడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. నేడు నందమూరి తారక రామారావు 101 జయంతి అన్న విషయం తెల్సిందే. ఈరోజు తన కొత్త సినిమా ప్రకటిస్తే ఆయన ఆశీస్సులు ఉంటాయని భావించిన కళ్యాణ్ రామ్.. తాత ఆశీస్సులతోనే తన 21 వ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇక ఎట్టకేలకు దాన్ని నిజం చేస్తూ మేకర్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఫస్ట్ గ్లింప్స్ లో కళ్యాణ్ రామ్ ముఖం చూపించకుండా చేతి పిడికిలిని చూపిస్తూ.. పవర్ ఫుల్ కళ్ళను చూపించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈసినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Also Read: Pushpa 2 Second Song: సింపుల్ అండ్ మాస్ స్టెప్పులతో పుష్ప, శ్రీవల్లీ దుమ్ము దులిపేశారు.. సుకుమార్ డాన్స్ వేరే లెవెల్

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×