BigTV English

Sudden Break:- క్రేజీ ప్రాజెక్టులకు సడెన్ బ్రేక్… ఇంటికి వచ్చేసిన హీరోలు

Sudden Break:- క్రేజీ ప్రాజెక్టులకు సడెన్ బ్రేక్… ఇంటికి వచ్చేసిన హీరోలు

Sudden Break:- షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న హీరోలు.. ఉన్నట్టుండి ఇంటికి వచ్చేశారు. ఒకరిద్దరు కాదు.. టాప్ హీరోలు ఇంటి బాట పట్టారు. కారణం షూటింగ్స్ ఆగిపోవడమే. శరవేగంగా జరుగుతున్న షూటింగ్స్ ఒక్కసారిగా ఆగడానికి ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంది. ఇలా సినిమా షూటింగ్ ఆగిపోయి ఇంటికి వచ్చేసిన వారిలో అల్లు అర్జున్, బాలకృష్ణ, రామ్ చరణ్, మహేశ్ బాబు, చిరంజీవి ఉన్నారు.


పుష్ప-2 సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇందుకోసం పక్కా షెడ్యూల్ తయారుచేసుకుని మరీ షూటింగ్ మొదలుపెట్టారు. అయితే, ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లపై సడెన్ ఐటీ రైడ్స్ జరిగాయి. అటు డైరెక్టర్ సుకుమార్ ఇంటిపైనా తనిఖీలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీంతో షూటింగ్‌కు బ్రేక్ చెప్పా్ల్సి వచ్చింది.

ఇక మహేశ్ బాబు సినిమాకు కూడా బ్రేక్ వచ్చిందనేది టాక్. ముఖ్యంగా త్రివిక్రమ్‌తో మహేశ్ బాబుకు గ్యాప్ రావడమే కారణం అంటున్నారు. సరైన ప్లానింగ్ లేకుండా షూటింగ్స్ చేస్తూ.. దాన్ని స్క్రాప్ చేస్తుండడంతో… అన్నీ రెడీ చేసుకుని రావాలని త్రివిక్రమ్ కు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా సమ్మర్ కారణంగా మహేశే బ్రేక్  తీసుకున్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు.


బాలకృష్ణ ఈ దసరాకు సందడి చేయాలనుకున్నాడు. విజయదశమి నాటికి అంతేగా అంతేగా అనిపించాలని అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ, ఈ సినిమాకు వర్షం అడ్డం వచ్చింది. వికారాబాద్ సైడ్ రీసెంట్ గా కురిసిన వడగళ్ల వానకు సెట్ పాడైందని టాక్. బాలకృష్ణతో యాక్షన్ సీన్స్ కోసం భారీ సెట్ వేశారని, వర్షానికి అవన్నీ పాడైనట్టు తెలుస్తోంది. సో, షూటింగ్ కు బ్రేక్.

శంకర్-రామ్ చరణ్ సినిమాకు కూడా బ్రేక్. కారణం వర్షాలే. దాదాపు 1200 మందితో భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తే.. వర్షం కారణంగా సెట్ మొత్తం పాడైందని తెలుస్తోంది. మళ్లీ అంత సెట్ వేయడానికి టైం పడుతుందంటున్నారు. సో, బ్రేక్ రావడంతో.. రామ్ చరణ్ కూడా ఇంటికొచ్చేశారని తెలుస్తోంది.

చిరంజీవి తీస్తున్న భోళా శంకర్ సినిమాకు చిన్న బ్రేక్ వచ్చిందంటున్నారు. స్క్రిప్ట్‌పై మరింత వర్కౌట్ చేయాలని మెహర్ రమేష్‌కు చిరంజీవి క్లాస్ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలే.. మెహర్ రమేష్‌కు ఒక్క హిట్టూ లేదు. కాని, భారీ బడ్జెట్ సినిమాలు తీశాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ కాకూడదని చిరంజీవినే స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పైగా ఐటమ్ సాంగ్ విషయంలోనూ మార్పులు చేస్తున్నారట. ముందుగా శ్రియతో ఎంగేజ్ చేసుకుంటే.. తను 75 లక్షలు అడిగిందని, 25 లక్షల్లో వచ్చే హీరోయిన్ కోసం చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×