BigTV English

Sudigali Sudheer’s ‘Family Stars’ Show: ‘ఫ్యామిలీ స్టార్స్’తో వస్తున్న ఫ్యామిలీ స్టార్.. సుడిగాలి సుదీర్ గాలి బానే వీస్తోందే.. ప్రోమో అదుర్స్!

Sudigali Sudheer’s ‘Family Stars’ Show: ‘ఫ్యామిలీ స్టార్స్’తో వస్తున్న ఫ్యామిలీ స్టార్.. సుడిగాలి సుదీర్ గాలి బానే వీస్తోందే.. ప్రోమో అదుర్స్!
Advertisement

Sudigali Sudheer’s New TV Show Family Stars Latest Promo Out Now: సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై అందం, అభినయం, డ్యాన్స్, కామెడీ.. ఏదైనా సుధీర్ దిగనంతవరకే. ఒక్కసారి సుధీర్ అడుగుపెట్టాడు అంటే ఎంటర్ టైన్మెంట్ పక్కా. ఇంకా నిజం చెప్పాలంటే యాంకర్ ను బట్టి షో చూసే రోజులు వచ్చాయి అంటే అది సుధీర్ వలనే అని చెప్పొచ్చు. ఈటీవీలో ఏ షో అయినా కింద లవ్ యూ సుధీర్ అన్న అనే కామెంట్ ఉంటుంది. అంతలా సుధీర్ కు ఫ్యాన్స్ బేస్ ఉంది.


ఇక జబర్దస్త్ వదిలేసి వెళ్ళాక సుధీర్ హీరోగా మారాడు. గాలోడు, కాలింగ్ సహస్ర లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుధీర్ జబరదస్త్ వదిలి వెళ్ళిపోయాక షోస్ లలో కనిపించకపోయేసరికి అభిమానులు అంతా మళ్లీ షోస్ చేయమని అదిగడం ప్రారంభించారు.

ఇక అభిమానుల కోరిక మేరకు సుధీర్ మళ్లీ షోస్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆహాలో సర్కార్ సీజన్ 4 కు యాంకర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈటీవీ లో మరో షోకు హోస్ట్ గా రాబోతున్నాడు. ఎంటర్ టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్ అంటే టక్కున ఈటీవీ అని చెప్పుకొచ్చేష్టరు. ఏడాది పొడువునా ఏదో ఒక పండగ చేస్తూనే ఉంటారు. సీరియల్ నటీనటులు ఈ ఈవెంట్స్ లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక సుధీర్ తో ఈటీవి ఫ్యామిలీ స్టార్స్ ఏ కొత్త షోను అనౌన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.


Also Read:Drama Juniors Season 7 Happy Days: ఆర్య వర్ధన్ కొత్త అవతారం.. వారికి పోటీ రాడుగా.. ?

షో అంతా ఒక ఎత్తు అయితే.. సుధీర్ లుక్ మరో ఎత్తు అని చెప్పాలి. కళ్ళజోడు, కూల్ డ్రెస్సింగ్ స్టైల్ తో కేక పుట్టించాడు. ఇక అమ్మాయిలతో మనోడి పులిహోర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటలు, పాటలు,గేమ్స్, చివర్లో కన్నీళ్లు.. ఇలా ఒక రోలర్ కోస్టర్ గా ప్రోమో సాగింది. జూన్ 2 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ షోలో సుధీర్ చేసే రచ్చ చూడాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×