BigTV English

Drama Juniors Season 7 Happy Days: ఆర్య వర్ధన్ కొత్త అవతారం.. వారికి పోటీ రాడుగా.. ?

Drama Juniors Season 7 Happy Days: ఆర్య వర్ధన్ కొత్త అవతారం.. వారికి పోటీ రాడుగా.. ?

Drama Juniors Season 7 Happy Days: వెంకట్ శ్రీరామ్ ఎవరో తెలుసా అని అడిగితే ఎవరు కొత్తహీరోనా.. ? అని అంటారు. అదే ఆర్యవర్ధన్ అని చెప్పండి.. మా ఆర్య సర్ గురించి మాకు తెలియదా అని అనేస్తారు. అంతలా ఒక్క క్యారెక్టర్ తో పాపులారిటీ సంపాదించుకున్నాడు శ్రీరామ్. విధి సీరియల్ తో శ్రీరామ్ ప్రేక్షకులకు పరిచమయ్యాడు. ఈ సీరియల్ మంచి విజయం అందుకోవడంతో దూరదర్శన్, ఈటీవీ, జెమినీ, జీ తెలుగు, మా, ఇలా అనేక ఛానల్స్‌కి యాంకర్‌ గా పని చేసి సినిమాల్లోకి వచ్చాడు. బొమ్మరిల్లు చిత్రంలో సిద్దార్థ్ కు అన్నగా నటించి మెప్పించాడు.


ఇక సీరియల్స్ లో నటించడమే కాకుండా వాటిని నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారాడు. రాధా కళ్యాణం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, వరూధిని పరిణయం లాంటి సీరియల్స్ కు నిర్మాతగా వ్యహరించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ తో శ్రీరామ్ కాస్తా ఆర్య వర్ధన్ గా మారాడు. ఈ సీరియల్ తరువాత శ్రీరామ్ రేంజ్ మారిపోయింది.

ఎక్కడికి వెళ్లినా ఆయన సొంత పేరుతో కాకుండా ఆర్య సార్.. ఆర్య సార్ అని పిలవడం ప్రారంభించారు. అంతలా ఈ సీరియల్.. శ్రీరామ్ ను మార్చేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ సీరియల్ టాప్ 1 సీరియల్ గా కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ కొత్త అవతారం ఎత్తాడు. ఎప్పుడో గతంలో చేసిన హోస్టింగ్ మరోసారి చేయడానికి రెడీ అయ్యాడు. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు.. తమలోని నటనకు పదునుపెట్టి.. బాలనటులుగా తమ సత్తా చాటుతున్నారు.


ఇక ఇప్పటికే ఆరు సీజన్స్ ఎంతో విజయవంతంగా పూర్తిచేసుకున్న డ్రామా జూనియర్ ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. ఇక ఈ సీజన్ కు శ్రీరామ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. హోస్ట్ కోసం ఆర్య సర్ తన లుక్ మొత్తాన్ని మార్చేసాడు. త్వరలోనే ఈ షో మొదలుకానుంది. మరి ప్రదీప్, సుధీర్ లకు శ్రీరామ్ పోటీగా రానున్నాడా.. ? ఎలా తన మాటల గారడీతో అభిమానులను మెప్పిస్తాడో చూడాలి.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×