Big Stories

Kuja Dosha: కుజదోషం అంటే ఏమిటి ? పెళ్లిళ్లు ఆలస్యంగా జరగడానికి ఇదీ ఓ కారణమా..?

Kuja Dosha: వివాహ బంధం కలకాలం సుఖ, సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకే పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకుంటారు. ఇద్దరి జాతకాలు కలిసాయో లేదో చూడటం కూడా అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇద్దరి జాతకాలు కలిసిన తర్వాతే పెళ్లి విషయంలో పెద్దలు ముందడుగు వేయడం జరుగుతోంది. అయితే పెళ్లిళ్లు కుదుర్చుకునే సమయంలో ఎక్కువగా వినిపించే మాట కుజ దోషం.

- Advertisement -

కుజదోషం ఉన్న వాళ్లకు పెళ్లిళ్లు కావనే నమ్మకం కూడా ఉంది. సంబంధం కుదుర్చుకునే సమయంలో కుజ దోషం గురించి పట్టించుకోవడం హిందువుల సంప్రదాయం. ఒకవేళ కుజ దోషం( మంగళదోషం) ఉంటే వాళ్లతో వివాహం జరిపించడానికి కుటుంబాలు కూడా అంగీకరించవు. కుజదోషం ఉన్న వాళ్లకి పెళ్లిళ్లు జరగడానికి, కుజ దోషం పోవడానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. మరి ఇవి ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

కుజదోష నివారణ, పరిహారాలు:

కుజదోషం ఉన్న వాళ్లు పూజలు చేయడం వల్ల దోషం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ దోషం వల్ల అనేక మంది స్త్రీ,పురుషులకు పెళ్లిళ్లు కావడం లేదు. కుజుడు లేదా అంగారక గ్రహం అశుభ ప్రభావం వల్ల ఈ కుజ దోషం కనిపిస్తుంది.

ఒక వ్యక్తి జాతకంలో 2,4,7,8,12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం ఉన్నట్లు చెబుతారు. ఈ స్థానాల్లో కుజుడి ఆధిపత్యమే కాకుండా సూర్య, గురు, కేతు, రాహువు ఆధిపత్యం వహించడం లేదా ఈ గ్రహాల దృష్టి కుజుడిపై పడే విధంగా ఉంటే కుజదోషం ఉందని చెబుతారు.

ఒక వ్యక్తి యొక్క స్వభావము, ఆత్మ గౌరవము, అహం వంటి వాటిని కుజుడు సూచిస్తాడు. జాతకంలో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. వీరి స్వభావంతో వీరికి అనేక సమస్యలు ఎదురవుతాయి. కుజుడు ఏడు స్థానాల్లో ప్రవేశించినా పెళ్లిలో సమస్యలు ఎదురవుతాయని చెబుతుంటారు. కుజ దోషం కారణంగా విడాకులు, భార్యాభర్తలు గొడవలు వంటి కూడా జరుగుతాయి.

దీని నుంచి బయట పడడానికి చాలా మంది రకరకాల పూజలు చేస్తుంటారు. దీనికి పరిష్కారాలున్నాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. కుజదోషం ఉన్న వాళ్ళకి ప్రధానంగా కుంభ వివాహం చేస్తారు. అంటే అరటి చెట్టుకు లేదా రావి చెట్టుకు వెండి లేదా బంగారు విష్ణువు ప్రతిమకు కుజదోషం ఉన్న వ్యక్తితో పెళ్లి చేస్తారు. ఇలా చేయడం వల్ల దోషం తొలగిపోతుందని చెబుతుంటారు.

Also Read: శుక్రవారం లక్ష్మీదేవినే కాదు.. ఈ దేవతలను కూడా పూజిస్తే ధనవంతులు అవుతారట..

కుజదోషం ప్రభావం నివారించుకోవడానికి నవ గ్రహ దేవతను పూజించడం మరో పరిష్కార మార్గంగా చెబుతారు. మంగళవారం నవగ్రహాలకు పూజ చేయడం వల్ల కుజదోషం నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే మంగళవారం హనుమంతుడిని దర్శించుకొని దీపం వెలిగిస్తే దోషం తొలగిపోతుందని చెబుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News