E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవికి అక్కగా, అమ్మగా, లవర్‌గా నటించిన ఒకేఒక్క హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

Chiranjeevi: చిరంజీవికి అక్కగా, అమ్మగా, లవర్‌గా నటించిన ఒకేఒక్క హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?
Advertisement

Chiranjeevi: సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువే ఉంటుంది. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడం ట్రై చేస్తుంటారు నటీమణులు. ఒకవేళ హీరోయిన్‌‌గా అవకాశాలు రాకపోతే అమ్మగా, అక్కగా నటించడానికి కూడా కొందరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా మెగాస్టా్ర్ చిరంజీవికి లవర్‌గా, భార్యగా, అక్కగా, అమ్మగా నటించిన నటీమణి ఒకరు ఉన్నారు. దాదాపుగా అయిదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ 1 హీరోగా, మెగాసార్‌గా వెలిగిపోతున్నారు చిరంజీవి. అలాంటి నటుడితో ఎన్నోసార్లు నటించే అవకాశం ఒక నటికి దక్కింది. ఆమే సుజాత.

ముందుగా లవర్‌గా

Advertisement

చిరంజీవి (Chiranjeevi), సుజాత (Sujatha) కలిసి దాదాపు అరడజను సినిమాల్లో నటించారు. సుజాత.. తన కెరీర్ మొదట్లో చిరుకు ప్రేయసిగా, భార్యగా నటించారు. కానీ మెల్లగా ఆయనకు తల్లి పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకున్నారు. అలా చిరంజీవి, సుజాత కలిసి నటించిన చాలావరకు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వీరిద్దరూ కలిసి ‘ప్రేమతరంగాలు’ అనే మూవీలో నటించారు. అందులో కృష్ణంరాజు మెయిన్ హీరో కాగా.. చిరంజీవి సెకండ్ హీరోగా నటించారు. ఇక తను ప్రేమించే అమ్మాయి పాత్రలో సుజాత కనిపించారు. ‘ప్రేమతరంగాలు’ విడుదలయిన రెండేళ్ల తర్వాత చిరంజీవితోనే మరో సినిమాలో కనిపించారు సుజాత. కానీ ఈసారి అక్క పాత్రలో. 1980లో ‘ప్రేమతరంగాలు’ విడుదలయ్యింది. అందులో చిరంజీవి, సుజాత ప్రేమికులుగా నటించారు. 1982లో వచ్చిన ‘సీతాదేవి’ చిత్రంలో వాళ్లిద్దరూ అక్కాతమ్ముడిగా కనిపించారు.

Also Read: డైరెక్టర్, హీరోని నమ్మి కోట్లు నష్టపోయిన టాలీవుడ్ హీరో..!

Advertisement

తల్లిగా కూడా

ప్రేమికులుగా ఇంప్రెస్ చేసిన చిరంజీవి, సుజాత.. ఆ తర్వాత అక్కాతమ్ముడిగా కూడా ఎమోషన్ బాగానే పండించారు. ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. 1995లో ‘బిగ్ బాస్’ సినిమా విడుదలయ్యే సమయానికి ఏకంగా చిరంజీవి అమ్మగా నటించడానికి ఒప్పుకున్నారు సుజాత. చిరంజీవి తర్వాత ఎంతోమంది సీనియర్ హీరోలకు అమ్మగా నటించారు. మెగాస్టార్ ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నా అందులో అన్ని రకాలు పాత్రలతో స్క్రీన్ షేర్ చేసుకుంది మాత్రం సుజాతతోనే. అలా చిరంజీవికి ప్రేయసిగా, అక్కగా, అమ్మగా నటించిన ఒకేఒక్క నటిగా సుజాత రికార్డ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ‘స్నేహం కోసం’ చిత్రంలో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో చిరంజీవికి యజమాని పాత్రలో కనిపించారు సుజాత.

ఆన్ స్క్రీన్ అమ్మ

1970ల్లోనే నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు సుజాత. ముందుగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత తెలుగులో అడుగుపెట్టారు. టాలీవుడ్‌లో కూడా తన నటనతో మంచి పేరు దక్కించుకున్నారు సుజాత. 2006లో విడుదలయిన ‘వరలరు’ అనే తమిళంలో సినిమాతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించారు. 2011లో హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. చిరంజీవి మాత్రమే కాదు.. ఎంతోమంది స్టార్ హీరోలకు తల్లిగా నటించి ప్రేక్షకులకు గుర్తుండిపోయారు సుజాత. ఆమె నటనతో ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళంలో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెంకటేశ్‌కు తల్లిగా ‘చంటి’ సినిమాలో కనిపించి ఆడియన్స్‌ను ఎమోషనల్ చేశారు సుజాత.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×